బాలీవుడ్ హీరోయిన్స్ తో పోల్చితే మన దగ్గర హీరోయిన్స్ కు పారితోషికం బాగా తక్కువగా ఉంటుందనేది గత కొంత కాలంగా హీరోయిన్స్ చేస్తున్న విమర్శలు. డెబ్యూ మూవీకైతే ఆ రెమ్యునిరేషన్ చెప్పుకోవడానికి కూడా కష్టమని కొంతమంది హీరోయిన్స్ పాపులారిటీ వచ్చాక వాపోతుంటారు. బాలీవుడ్ లో హీరోల స్థాయిలో అక్కడ హీరోయిన్స్ కు కోట్లల్లో రెమ్యునిరేషన్స్ ఇస్తూ ఉంటే సౌత్ లో హీరోయిన్స్ కు మాత్రం కొద్ది మంది హీరోయిన్స్ కు తప్ప ఎక్కువ శాతం మందికి లక్షల్లోనే పారితోషికం ఇస్తున్నారంటూ పలువురు హీరోయిన్స్ బాధపడుతున్నారు. సౌత్ లో ఒక హీరోయిన్ కోటి రూపాయల పారితోషికం దక్కించుకుందంటే ఆమె స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయినట్లే. 


ఇప్పుడు రష్మిక మందన్న ఆ జాబితాలో చేరిపోయిందట. 'ఛలో' 'గీత గోవిందం' చిత్రాలకు 10 నుండి 20 లక్షల మద్యలో రెమ్యునిరేషన్ తీసుకున్న రష్మిక 'గీత గోవిందం' చిత్రం సూపర్ హిట్ తర్వాత తన పారితోషికంను దాదాపు 40 లక్షల వరకు పెంచేసిందట. ప్రస్తుతం వరుసగా తెలుగు, తమిళం, కన్నడంలో నటిస్తూ వస్తున్న ఫుల్ స్వింగ్‌లో రష్మిక తన రెమ్యునిరేషన్ ను మరింతగా పెంచుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం. స్టార్స్ నటిస్తున్న సినిమాల నుండి ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో రష్మిక తన రెమ్యునిరేషన్ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో పెంచేసిందట. 


స్టార్ హీరోయిన్స్ పొందే కోటి రెమ్యునిరేషన్ ను రష్మిక డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరో, డైరెక్టర్ ని బట్టి రష్మిక రెమ్యునిరేషన్ డిమాండ్ చేస్తుందనే టాక్. స్టార్ హీరోలతో అయితే 80 లక్షల వరకు చిన్న హీరోలకు జోడీగా అయితే కోటి వరకు ఈమె డిమాండ్ చేస్తుందట. గతంలో గోవా బ్యూటీ ఇలియానా ఇలా కోటి డిమాండ్ చేసిందనే నెమ్మదిగా పక్కన పెట్టారని, ఇప్పుడు రష్మిక కూడా ఇలా ఖచ్చితంగా కోటి కావాలంటే మెల్లగా అవకాశాలు చేజారడం ఖాయం అని కూడా ఓవైపు వినిపిస్తోంది. మరి రష్మిక కు ఈ విషయం తెలుసో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: