సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ త్రిషా కృష్ణన్ దశాబ్ధం పైగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ అందుకున్న త్రిష టాలీవుడ్ యువ హీరో రానాతో డేటింగ్ చేసిన వార్తల్లో అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈమధ్యనే రానా కూడా త్రిష గురించి స్పందిస్తూ త్రిష తనకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పాడు. 


ఆ తర్వాత వరుణ్ మణియన్ తో ఎంగేజ్ మెంట్ దాకా వెళ్లిన పెళ్లి కాస్త పెటాకులయ్యింది. ఫైనల్ గా తనకు ఇంతటి క్రేజ్ ఇచ్చిన సినిమాల మీద మళ్లీ దృష్టి పెట్టాలని భావించిన త్రిష వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. లాస్ట్ ఇయర్ తమిళంలో 96 సినిమా సూపర్ హిట్ అవడంతో ఫాంలోకి వచ్చిన త్రిషా వరుస సినిమాలు చేస్తుంది.


ఇక ఇప్పుడు కెరియర్ మంచి జోష్ లో ఉన్న ఇలాంటి టైంలో అమ్మడు మళ్లీ ఎవరితోనో ప్రేమలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాంగీ సినిమా చేస్తున్న త్రిషా ఈమధ్యనే తన ఫ్యాన్స్ తో చాట్ చేసింది. ఓ అభిమాని మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటని అడిగితే.. త్రిష ఇచ్చిన సమాధానం షాక్ ఇచ్చింది. మ్యారేజ్ గురించి అడిగితే సింగిల్ బట్ టేకెన్ అని అన్నది. అంతేకాదు డూ ఇట్‌ వెన్‌ ఇట్స్‌ ఏ వాంట్‌ అండ్‌ నాట్‌ ఏ నీడ్‌ అంటూ చెప్పుకొచ్చింది.


త్రిషా సమాధానం చూస్తుంటే అమ్మడు మళ్లీ ఎవరితోనో లవ్ లో పడినట్టే అనిపిస్తుంది. అతను ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. చూస్తుంటే కోలీవుడ్ లో మళ్లీ త్రిషా లవ్ ఎఫైర్ న్యూస్ మళ్లీ హాట్ న్యూస్ గా మారబోతుంది. తెలుగులో కూడా త్రిషకు అవకాశాలు వస్తున్నా కోలీవుడ్ లో ఫీమేల్ లీడ్ సినిమాలకే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: