2014 ఎన్నికల్లో జనసేన పార్టీని స్థాపించి ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబు కి మద్దతు తెలిపి చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం లో ప్రధాన పాత్ర పోషించారు. అయితే తాజాగా 2019 ఎన్నికలలో రెండు నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కెరియర్పై ఇప్పుడు అనేక వార్తలు వస్తున్నాయి.


ముఖ్యంగా పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు రెండు చోట్ల ఓడిపోవడం అనేది ఇదే ప్రథమమని..మరియు అదే విధంగా తమ అభిమాన నటుడు ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెడతారని అనుకున్నా మెగా అభిమానులకు పవన్ కళ్యాణ్ ఓటమిని ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు బండ్ల గణేష్.


తాను ప్రస్తుతం ఎలాంటి చిత్రాన్ని నిర్మించడం లేదని తెలిపాడు. నా నిర్మాణ సంస్థలో తదుపరి చిత్రం ఇంకా ఖరారు కాలేదు. సినిమా నిర్మించాలని అనుకుంటే ముందుగా నేనే అధికారికంగా ప్రకటిస్తా అని బండ్లగణేష్ తెలిపాడు. ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసి ఇబ్బంది పెట్టవద్దు అని కూడా బండ్ల గణేష్ సీరియస్ అయ్యాడట. ఎవరి మీద పడితే వారి మీద ఇష్టానుసారంగా వార్తలు రాయడం వల్ల రాసిన వారు బాగానే ఉంటారు ఎవరి పైన అయితే వార్తలు రాశారో వారు అనేక ఇబ్బందులు పడతారని కానీ దయుంచి వాస్తవం తెలుసుకుని వార్తలు రాయాలని బండ్ల గణేష్ సూచించారట.



మరింత సమాచారం తెలుసుకోండి: