భారతదేశ ప్రధానిగా నరేంద్రమోదీ రెండో సారి బాధ్యతలు చేపట్టారు. గురువారం సాయంత్రం 7గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.  ఈ ప్రమాణస్వీకారంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. సుమారు 8,000 మంది అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.  సాధారణంగా రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. 


 కాగా, ఈ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన అతిరథ మహారథులు రావడంతో రాష్ట్రపతి భవన్ లో కోలాహలం అంబరాన్నంటింది. ప్రధానిగా రెండో సారి ప్రమాణ స్వీకారానికి అన్ని సినీ పరిశ్రమల నుంచి తారలు విచ్చేశారు.  బిమ్ స్టెక్ దేశాల అధినేతలు, పలు దేశాల ప్రతినిధులు, రజనీకాంత్, కంగనా రనౌత్, కరణ్ జోహార్ వంటి సినీ తారలు, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


ఓ వైపు సినీ సందడి..మరో వైపు రాజకీయ నాయకుల సందడి ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవ వాతావరణం ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించింది.  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం పళనిస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: