అందేంటీ ఏపనికైనా ఓ కమిట్ మెంట్ అంటూ ఉంటేనే కదా..ఆ పని ముందు సాగేదీ అని అనుకుంటున్నారా..అబ్బే మీరు ఊహిస్తున్న కమిట్ మెంట్ కాదండీ...ఈ కమిట్ మెంట్ వేరే..ఇండస్ట్రీలో ఆ మద్య నటి  శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.  సినీ పరిశ్రమలోకి రావాలని చూస్తున్న ఎంతో మంది యువతులు తమ మానం కమిట్ మెంట్ ఇస్తేనే ఛాన్స్ లేదంటే ఔట్ అనేవారు చాలా మంది ఉన్నారని..అలాంటి వారికి తాను కూడా బలైయ్యానని టాలీవుడ్ లో ఇలాంటి రాబందులు..కామ పిశాచులు ఎంతో మంది ఉన్నారని నటి  శ్రీరెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది.  


చాలా మంది జూనియర్ ఆర్టిస్టులను పడక సుఖం కోసం వేధించే దుర్మార్గులు టాలీవుడ్ లో ఉన్నారని..వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా యుద్దం చేస్తూనే ఉంది.  తాజాగా కాస్టింగ్ కౌచ్ పై  నటి రాధా ప్రశాంతి ఘాటు విమర్శలు చేశారు.  నేను సినీ పరిశ్రమలోకి వచ్చి చాలా మందిని కాంప్రమైజ్ అయ్యేవాళ్లను చూశా.. కాంప్రమైజ్ అయితే తప్ప వారికి అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్లను కూడా చూశానని రాధా ప్రశాంతి తెలిపారు. 


సినీ పరిశ్రమలో మంచి నిర్మాతలు, డైరెక్టర్లు ఉన్నారని.. విశ్వనాథ్, మణిరత్నం, బాలచందర్, బాలు చందర్ వంటి గొప్ప డైరెక్టర్లు వాళ్ల పాత్రకు ఎలాంటి వాళ్లు సరిపోతారో అలాంటి వారికే ప్రాధాన్యత ఇచ్చేవారు..లేదంటే కొత్త వారికి అవకాశం ఇచ్చేవారు.  కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి..తెలుగు నటీమణులకు కమిట్ మెంట్ ఇవ్వకుంటే వేరు చిత్ర పరిశ్రమ నుంచి తీసుకు రావడం కామన్ అయ్యింది. ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన వాళ్లు ఏ కావాలని ఆమె ప్రశ్నించింది. ఇప్పటికైనా దర్శకనిర్మాతలు, హీరోలు ఈ విషయం గురించి ఆలోచించాలని ఆమె పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: