ఊహలు గుసగుసలాడే అంటూ పంజాబ్ నుంచి టాలీవుడ్ కు వచ్సిన బ్యూటీ రాశి ఖన్నా.  ఫస్ట్ సినిమాతో మెప్పించింది.  గ్లామర్ గా కనిపించినా గ్లామర్ పాత్రలను పెద్దగా లైక్ చెయ్యదు.  కేవలం గ్లామర్ ఉండే పత్రాలు చేయడం వలన కొన్ని రోజులు మాత్రమే ఇండస్ట్రీ ఉంటాం.  పెద్దగా అవకాశాలు కూడా రావు.  అలా కాకుండా పెరఫార్మన్స్ కు స్కోప్ ఉండే పాత్రలు చేస్తే ఎక్కువ కాలం హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవచ్చు.  


అందుకే అలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.  ఇందులో భాగంగానే ఆమెకు వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమా చేసే అవకాశం వచ్చింది.  ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ సినిమా తరువాత శ్రీనివాస కళ్యాణం వంటి సినిమా చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు.  


ఇదిలా ఉంటె, ప్రస్తుతం ఈ అమ్మడు నాగచైతన్యతో వెంకిమమా సినిమా చేస్తోంది. లవకుశ దర్శకుడు బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇకపోతే, సినిమాల విషయంలో ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం రాశి వాసికి తగ్గట్టుగా ఫోటోలు షేర్ చేస్తూ..అదరహో అనిపిస్తోంది.  


రీసెంట్ గా ఈ అమ్మడు వివా లా మోర్ మ్యాగజైన్  కవర్ పేజీకి ఫోజులు ఇచ్చింది.  ఈ కవర్ పేజీపై ఇచ్చిన ఫోజులు చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.  ట్రాన్స్పెరెంట్ కలర్ డ్రెస్ తో అందాలను ప్రదర్శిస్తూ ఉన్న డ్రెస్ అది.  కవర్ పేజ్ ను చూసి మ్యాగజైన్ ను కొనేస్తున్నారు.  అది అసలు విషయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: