మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన కొండవీటి దొంగ, కొదమసింహం సినిమాలు గుర్తున్నాయి కదా..  ఆ రెండు సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  మెగాస్టార్ హీరోయిజాన్ని ఎలివేట్ సినిమా సినిమాలు అవి.  స్టైల్, లుక్ కొత్తగా ఉండటంతో అభిమానులను ఆకట్టుకుంది.  ఇప్పుడు ఇదే స్టైల్ ను చిరు తనయుడు చిరుత రామ్ చరణ్ ఫాలో అవుతున్నాడు.  


చరణ్ టాంజానియా ఫారెస్ట్ లో సతీమణి ఉపాసనతో కలిసి వెకేషన్ కోసం వెళ్ళాడు.  రోమ్ లో ఉంటె రోమన్ లా ఉండాలి అని చెప్పి... అడవి మృగాలా మధ్య ఉన్నప్పుడు కౌబాయ్ లా ఉండాలని చెప్పి హ్యాట్ తో అదరహో అనిపించాడు.  చరణ్ ను చూస్తుంటే... మెగాస్టార్ సినిమా కొదమసింహం సినిమాకు సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది కదా.  


కొదమసింహం సినిమాను రీమేక్ చేసి ఆ సినిమాలో చరణ్ హీరోగా నటిస్తే చూడాలని అభిమానులకు ఉంటుంది.  కొదమసింహం సినిమాకు సీక్వెల్ కు రాజమౌళి దర్శకత్వం చేస్తే ఇంకా బాగుంటుంది.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు.  దీని తరువాత రాజమౌళితోనే చరణ్ కొదమసింహం 2 తీస్తే బాగుంటుంది కదా.  


ఎన్నో హోప్స్ తో వచ్చిన వినయ విధేయ రామ ప్లాప్ కావడం అభిమానులను ఇబ్బంది పెట్టింది.  ఆర్ఆర్ఆర్ తో ఆ లోటు తీరిపోతుందని అభిమానుల విశ్వాసం.  రాజమౌళి సినిమా అంటే పక్కా గ్యారెంటీ అనే విషయం టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే అంత ధీమాగా ఉన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: