విజయవాడ ఎంపీ కేశినేని నాని భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) వైపు అడుగులు వేస్తున్నారన్న ఊహాగానాల నేపధ్యం లో ఆయన తో తెలుగుదేశం పార్టీ లోక్ సభ  సభ సభ్యుడు  గల్లా జయదేవ్ భేటీ కావడం  రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. విజయవాడ ఎంపీగా రెండవసారి గెల్చిన కేశినేని నాని , ఇటీవల బీజేపీ సీనియర్ నేత గడ్కరీ తో భేటీ అయిన విషయం తెల్సిందే. గడ్కరీ తో నాని భేటీ కావడం తో ఆయన బీజేపీ లో చేరనున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపధ్యం లో  తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కట్టబెట్టిన పార్లమెంటరీ ఉప నాయకుడు,  విప్ పదవిని నాని బహిరంగానే తిరస్కరించడం హాట్ టాఫిక్ గా మారింది. ఇక నాని పార్టీ మారడమే తరువాయి అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న సమయం లో నాని ని బుజ్జగించేందుకు జయదేవ్ భేటీ అయి ఉంటారన్న వాదనలు విన్పిస్తున్నాయి.

విప్ పదవిని తిరస్కరించడాన్ని రాజకీయం చేయవద్దని తన మనస్సు లో మాటను ఫేస్ బుక్ ద్వారా చెప్పానని అంతకుమించి అందులో రాజకీయ ప్రాధాన్యత ఏమిలేదని నాని మీడియా తో మాట్లాడుతూ వెల్లడించారు. తనకు ఏ పదవులు వద్దని, అన్ని పదవుల కన్నా విజయవాడ ఎంపీ పదవే పెద్దదని ఆయన  చెప్పుకొచ్చారు. ఏ పదవి లేకపోయినా విజయవాడ ఎంపీ గానే, కేంద్రం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని, అలాగే విభజన హామీలపై పోరాడానని నాని గుర్తు చేశారు.  నాని చెబుతున్నట్లు ఏ పదవులు అవసరం లేకపోతే అదే విషయాన్నీ పార్టీ అధినేత కు విన్నవించి ఉంటే సరిపోయేది కానీ క్యాడర్ ను గందరగోళ పర్చే విధంగా ఫేస్ బుక్ ద్వారా తన అభిప్రాయం తెలియజేయడం ఏమిటని, అంతేకాకుండా అధినేతను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం దారుణమని తమ్ముళ్లు మండిపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీరు పై గత కొంతకాలంగా నాని అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీఅధికారం లో ఉన్న సమయం లో ఎటువంటి పదవులు ఇవ్వకుండా ప్రతిపక్షం లో ఉన్న సమయం లోపదవులు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అందుకే విప్ పదవి నితిరస్కరిస్తూ బహిరంగానే తన అసంతృప్తి ని వెల్లడించాలని నాని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీనాయకత్వ ప్రతినిధిగా గల్లా జయదేవ్, నానిని కలుసుకున్నారు. ఇద్దరి  మధ్య భేటీ ఇంకా కొనసాగుతున్ననేపధ్యం లో జయదేవ్ బుజ్జగింపుల కు నాని  ఎంతవరకు మెత్తబడుతారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: