విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి హిందీలో `కబీర్ సింగ్` పేరుతో రీమేకైన సంగతి తెలిసిందే. మాతృకకు దర్శకత్వం వహించిన సందీప్ వంగా స్వయంగా బాలీవుడ్ లోనూ దర్శకత్వం వహించారు. 21 జూన్ హిందీ వెర్షన్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటికే కబీర్ సింగ్ టీమ్ జోరుగా ప్రచారం ఊదరగొట్టేస్తోంది. ఆ క్రమంలోనే ఎప్పటికప్పుడు పోస్టర్లు- టీజర్లు అంటూ చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. ప్రస్తుతం కబీర్ సింగ్ టైటిల్ పాత్ర ధారి షాహిద్ కపూర్ ఓవైపు.. ప్రీతి పాత్రధారి కియరా అద్వాణీ మరోవైపు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఏ రేంజులోవ వర్కవుటైందో చూపే ఓ పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేశారు.


కబీర్ - ప్రీతి జంట ప్రేమకు ఆహ్వానం పంపిస్తున్నారు! అంటూ ఈ పోస్టర్ ని రివీల్ చేశారు. ఇక ఈ పోస్టర్ వచ్చిన క్షణాల్లోనే దీనిపై షాహిద్ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ డిబేట్ నడిపిస్తున్నారు. కొందరు అభిమానులు అయితే ఇది అర్జున్ రెడ్డి పోస్టర్ కి సేమ్ టు సేమ్ కాపీలా ఉందని విమర్శించారు. బాలీవుడ్ ఈరోజుల్లో అంతా కాపీనే అంటూ ఈ ముద్దుపై అభిమానుల్లో ఆసక్తికర డిబేట్ సాగుతోంది. అయితే తెలుగు వెర్షన్ తెరకెక్కించిన సందీప్ రెడ్డినే హిందీ లోనూ డైరెక్ట్ చేసినప్పుడు కాపీ ఎలా అవుతుంది? అంటూ వేరొక అభిమాని తిరిగి కౌంటర్ వేశారు. మొత్తానికి `కబీర్ సింగ్`కి కావాల్సినంత ప్రచారం సాగుతోంది. నెటిజనులు ప్రస్తుతం ఈ పోస్టర్ ని జోరుగా వైరల్ చేస్తున్నారు.


ఇక ఈ పోస్టర్ లో కియరా- షాహిద్ లిప్ లాక్ ని పరిశీలిస్తే.. ఇది అదర చుంబనం అనే కంటే.. అది ప్రేమతో కూడుకున్న చుంబనం అని స్పష్టంగా కనిపిస్తోంది. పెదవికి దిగువగా ఆ చిన్ పై ఎంతో ఎమోషనల్ కిస్ ఇది. ఆ సంగతి కాస్తంత పరిశీలనగా చూస్తే అర్థమవుతుంది. అలాగే గుబురు గడ్డాలు పెంచి షాహిద్ రఫ్ & ఠఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. బాలీవుడ్ లోనే బెస్ట్ పెర్ఫామర్ గా గుర్తింపు ఉన్న షాహిద్ కబీర్ పాత్రలో ఏ స్థాయిలో నటించాడో వేచి చూడాల్సిందే. సినీ1 స్టూడియోస్ - టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: