పాకిస్తాన్ లో ఇండియన్ సినిమాలకు మంచి డిమాండ్ ఉన్నది.  బాలీవుడ్ లో రిలీజైన చాలా సినిమాలు పాక్ లో రిలీజ్ అవుతుంటాయి.  ముఖ్యంగా ఖాన్ త్రయం నటించిన సినిమాలకు అక్కడ ఫ్యాన్స్ అధికం.  పక్కా హిందూ మూవీగా వచ్చిన భజరంగి భాయ్ జాన్ అక్కడ బాగా ఆడింది. ఖాన్ త్రయం సినిమాలే కాదు మిగతా సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉన్నది. 

సినిమా అన్నది వినోదం కోసమే కాబట్టి జనాలకు నచ్చింది అంటే తప్పకుండా చూస్తారు.  పాక్ లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమా సుల్తాన్.  అయితే, పాక్ లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.  ఖాన్ త్రయాన్ని పక్కకు నెట్టి రణబీర్ కపూర్ హీరోగా చేసిన సంజు సినిమా అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది.  


ఈ సినిమా ఏకంగా 37.60 కోట్లు వసూలు చేసి టాప్ లిస్ట్ లో ఉన్నది.  ఈ సినిమా తరువాత సుల్తాన్ 37 కోట్లు వసూలు చేసింది.  ధూమ్ 3, పీకే, భజరంగి భాయ్ జాన్, దిల్వాలే సినిమాలు ఆ తరువాత లిస్ట్ లో నిలిచాయి.  భారత్ సినిమా ఇండియాతో పాటు పాక్ లోను రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.  


స్టార్ హీరోల సినిమాలతో పాటు పాక్ లో చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి.  బాజీరావు మస్తానీ, బ్రదర్స్, ఫ్యాన్,రేస్ 3, సింగ్ ఈజ్ కింగ్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, తను వెడ్స్ మను వంటి సినిమాలు అక్కడ యావరేజ్ కలెక్షన్లు సాధించాయి.  పాక్ సినిమాలు కూడా ఇండియాలో రిలీజ్ అవుతుంటాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: