ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఫేమస్ అవుతారు. ఈ గ్లామర్ ప్రపంచంలో ఒక చిన్న ట్వీట్ లేదా చిన్న కామెంట్ చాలు అన్నీ మీడియా ఛానళ్ళ నుంచి లెక్కకు మించి ఉన్న సోషల్ వెబ్ సైట్స్ వరకు అందరు ఫోకస్ చేస్తారు. ఇలా ఫోకస్ చాలానే కొందరు అనవసరంగానూ మాట్లేడెస్తుంటారు. ఇక శ్రీ రెడ్డి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..'మీటూ' అంటూ ఒక పెద్ద ఉద్యమాన్ని మొదలు పెట్టింది. ఈ మీటూ ఇండస్ట్రీని బాగా డిస్ట్రబ్ చేసిందనే చెప్పాలి. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న అంశం 'మీటూ' అన్న విషయం అందరికి తెలిసిందే. 


టాలీవుడ్‌తో పాటు..కోలీవుడ్, బాలీవుడ్ లోను దీని బాగా రచ్చ జరుగుతూనే ఉంది. అవకాశం ఇవ్వాలంటే మహిళా ఆర్టిస్టులు సెక్స్‌ సుఖం ఇవ్వాలనేది దారుణమని కొందరు ఫీమేల్ యాక్ట్రెస్ దీనిపై తమ గళం విప్పుతున్నారు. ఇక ఇదే విషయానికి వస్తే తాజాగా తమిళంలో శివకార్తికేయన్‌ హీరోగా 'మిస్టర్‌ లోకల్‌' నే సినిమా విడుదలైంది. 'షాలు షమ్ము' అనే క్యారెక్టర్‌ ఆర్టిస్టు కొన్ని తమిళ సినీమాలతో పాటు శివకార్తికేయన్‌ 'మిస్టర్‌ లోకల్‌'లో కూడా నటించింది. ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇదంత బానే ఉంది. కానీ షాలూ కూడా మీటూ బాధితురాలినని అంటూ పెద్ద బాంబ్ పేల్చింది. 


అంతేకాదు ఈ విషయంలో విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించడం అందరిని ఆందోళనకి గురి చేసింది.  ఈమధ్య ఓ ఫేమస్‌ డైరెక్టర్‌ ఓ రాత్రి తనతో గడిపితే విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ ఇప్పిస్తానని అన్నాడట. అయితే షాలు ఆ దర్శకుడు ఎవరో మాత్రం చెప్పలేదు. కానీ ఈ వివాదంలోకి అనవసరంగా విజయ్‌దేవరకొండ పేరు ప్రస్తావించడం వల్ల ఈ షాకింగ్‌ కామెంట్స్‌ బాగా వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? ఏ సినిమాలో నటించడానికి షాలుకి అలాంటి చెత్త ఆఫర్ చేశాడన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ ఇద్దరు విజయ్ ని బ్యాడ్ చేయడం మాత్రం పద్దతిగా లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: