సినిమా అంటే ఏ భాషలోనైనా కోట్ల లో పెట్టుబడి..కోట్లలోనే రాబడి...కానీ పోతే మాత్రం కొంత మంది జీవితాలు సర్వ నాశనం అవుతాయి. ఒక మోస్తారు సినిమాని 30-40 కోట్లు ఖర్చుపెట్టి రాత్రింబవళ్ళు కష్టపడి తీస్తే కేవలం ఒకే ఒక్క ఆటతో ఏమైనా జరగొచ్చు. ఏం జరగనుందో తెలుసుకునే లోపే కోట్లకు కోట్లు వచ్చి పడొచ్చు..లేదా జీవితాలు రోడ్డునా పడొచ్చు. ఈ రంగుల ప్రపంచం ఒక మాయా ప్రపంచం. అంతా అందరికి తెలిసినట్టే..అర్థమవుతున్నట్టే ఉంటుంది..కానీ ఏమీ ఎప్పటికీ అర్థం కాదు. ఇది వాస్తవం. ఎవరు ఎలాంటి కంటెంట్ తో సినిమా తీసినా ఫైనల్ గా  పెట్టుబడి పెట్టిన నిర్మాత, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభాల కోసమే వ్యాపారం చేస్తారు. అంతే తప్ప హీరోకో దర్శకుడికో పేరు వస్తే చాలు మాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదని ఎవరూ అనుకోరు. అలా అనుకుంటే మాత్రం వాళ్ళు పైన చెప్పిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కారు. 


కాకపోతే నిర్మాత అనే వాడు ఆశాజీవి. ఒకదాంట్లో పోయింది ఇంకోదాంట్లో వస్తుందన్న నమ్మకమే డిజాస్టర్లు, ఫ్లాపులు, యావరేజ్ లు వచ్చినా ఇంకో సినిమా కోసం ఆస్తులను అమ్మో, అప్పు చేసో సినిమా తీయడానికి సిద్దమై పోతాడు. ఇది నిజంగా సినిమాను ప్రేమించే వాళ్ళ అదృష్టమనే చెప్పాలి. అందుకే మన హీరోలు.. నిర్మాతలు బావుండాలని కోరుకుంటుంటారు. జనవరి నుంచి ఇప్పటిదాకా అందరూ హ్యాపీగా ఫీలైన సినిమాలు చాలా చాలా తక్కువ. ఎఫ్2 ఒక్కటే ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా నిర్మాతకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. వినయ విధేయ రామ తో పాతిక కోట్ల దాకా నష్టం కలగగా, ఎన్టీఆర్ బయోపిక్ ఏకంగా యాభై కోట్ల దాకా నష్టాలని మిగిల్చింది. 


మిస్టర్ మజ్ను-వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలు కూడా అనుకున్న అంచనాలను తారుమారు చేసి నిరాశపరిచాయి. యాత్ర-కళ్యాణ్ రామ్ 118 మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఫర్వాలేదనిపించే ఫలితాన్ని ఇచ్చాయి. ఇక చిన్న సినిమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. మహర్షి వంద కోట్లు తెచ్చిందని చెప్పుకున్నా సీడెడ్ తో పాటు ఓవర్సీస్ లోనూ నష్టాలు తప్పలేదు. చిత్రలహరి మాత్రం హమ్మయ్య అనిపించింది. ఇక రీసెంట్‌గా రిలీజైన హిప్పి-సెవెన్ సినిమాలది కూడా అదే పరిస్థితి. మరి ఇప్పటికైనా దర్శక నిర్మాతలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను బడ్జెట్ ను కంట్రోల్ చేస్తూ తీస్తే సేఫ్ గా ఉండే అవకాశాలున్నాయి. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం.



మరింత సమాచారం తెలుసుకోండి: