అందముంది, చూపించే దమ్ము ఉంది. అయినా  హిట్లు లేకపోతే ఎవరు పట్టించుకుంటారు. కైరా అద్వానీ పరిస్థితి ఇంతే. ఆమెకు తెలుగులో ఇపుడు చాన్సులు లేవు. సోషల్ మీడియా వేదికగా తెగ రచ్చ చేస్తున్నా ఈ అమ్మడిని  టాలీవుడ్ పక్కన పెడుతోందట.


సరే అటుంచి ఇటు నరుక్కు వద్దాం అనుకుంటోంది ఈ చిన్నది. వినయ విధేయ రామ చిత్రంలో తన నాజూకు అందాలు ఎరవేసి కుర్రకారు గుండెల్లో తిష్టవేసిన కైరా అద్వానీ -తాజాగా తమిళంవైపూ చూపు తిప్పుతోందట. చేసినవి కొద్దిపాటి చిత్రలే అయినా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన కైరా -తమిళంలోనూ సత్తా చూపించాలన్న కసితో ఉందని అంటున్నారు. అందులో భాగంగానే తమిళంలో ఓ చాన్స్ అందుకుని -ఆ పాత్రతో ఆడియన్స్‌కు దగ్గరవ్వాలని కలలు కంటోందట. 


నయనతార ప్రేమికుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమిళంలో శివకార్తికేయన్ హీరోగా ఓ ప్రాజెక్టు ప్లాన్ చేశాడు. ఆ సినిమాలో శివకు జోడీగా కైరాను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. తమిళ ఆడియన్స్ నుంచి తనకు మంచి రెస్పానే్స వస్తుందన్న నమ్మకంతో ఉందట కైరా. అయితే కైరాను కన్ఫర్మ్ చేసుకున్న విషయాన్ని చిత్రబందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి అక్కడ హిట్ కొట్టి తెలుగులోకి విజయవంతంగా మళ్ళీ వస్తుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: