దొరసాని సినిమా టీజర్ రిలీజ్ అయింది. దొరసానికి పేదవాడికి మధ్య ప్రేమ కథను చాలా అందంగా చిత్రీకరించారు. జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ చాలా అందంగా కనిపించింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పాత్రకు తగినట్లుగా నటించాడు.

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఆనంద్ దేవరకొండ సినిమాను మరో రకంగా ఊహించుకున్నామని విజయ్ లాంటి ఆటిట్యూడ్తో ఉంటుందని ఊహించుకున్నామని సినిమా టీజర్ వేరే విధంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆనంద్ దేవరకొండ అన్న ఇమేజ్ కు భిన్నంగా సినిమాల్లో ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది.

టీజర్లోని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కె వి మహేందర్ దర్శకత్వం వహిస్తుండగా సురేశ్ ప్రొడక్షన్స్ సురేశ్ బాబు మధుర ఎంటర్టైన్మెంట్స్ మధుర శ్రీధర్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: