మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.  ఇది పాన్ ఇండియన్ మూవీ కావడంతో షూటింగ్ చాల స్లోగా జరిగింది.  పైగా పర్ఫెక్ట్ గా రావాలని ఎంత ఆలస్యమైనా పర్వాలేదని రామ్ చరణ్ చెప్పడంతో ఇలా ఆలస్యం అయ్యింది.  బాలీవుడ్ స్టార్ అమితాబ్ కూడా ఇందులో నటించాడు.  మెగాస్టార్ కు గురువుగా చేశాడు.  


అయితే, ఇక్కడ మరొ విషయం బయటకు వచ్చింది.  సైరా సినిమాలో చిరంజీవి తో పాటు మరో హీరో కూడా ఓ ప్రముఖ పాత్ర చేశారని తెలుస్తోంది.  మెగాస్టార్ తో కలిసి ఆ కాలంలో చాలా సినిమాలు చేశారు.  ఇద్దరు బెస్ట్ హీరోలే.  ఆ హీరో ఎవరో కాదు రజినీకాంత్.  రజినీకాంత్ సైరా లాంటి ప్రతిష్టాత్మకైనా సినిమాలో అతిధి పాత్ర చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.  


విజయ్ సేతుపతి ఇప్పటికే ఈ సినిమాలో ఓ రోల్ చేశారు.  కానీ, ఇప్పుడు రజినీకాంత్ కూడా ఈ సినిమాలో రోల్ చేశారనే వార్తలు వస్తుండటంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.  తమిళనాడులో రజినీకి ఎలాంటి మార్కెట్ ఉందొ తెలిసిందే.  ఇటు తెలుగులో కూడా రజినీకి మంచి మార్కెట్ ఉంది.  


బాలీవుడ్ లో సైతం ఆయనకు సూపర్ మార్కెట్ ఉన్నది.  సో, రజినీకాంత్ లాంటి స్టార్ సైరాలో ఉన్నాడు అంటే అది సినిమాకు ప్లస్ అయినట్టే కదా మరి.  ఇంతమంది స్టార్లున్న ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  దసరా కానుకగా వస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: