కంగనా రనౌత్ ను చూస్తుంటే వర్మ గుర్తుకు వస్తున్నాడు.  వర్మ సినిమాల విషయంలో ఎలాగైతే వివాదాలు చేస్తుంటాడో.. ఎలా వివాదాలు సృష్టిస్తుంటాడో... ఇప్పుడు కంగనా కూడా అదే విధంగా వివాదాలు చేసేందుకు సిద్ధం అవుతున్నది.  మణికర్ణికా సినిమా తో వివాదాస్పద దర్శకురాలిగా ముద్రపడింది.  సినిమా బాగా వచ్చింది.  అయితే, ఒరిజినల్ గా దర్శకత్వం వహించిన క్రిష్ ... నేను బంగారం తీస్తే.. దాన్ని కంగన వెండిలా మార్చేసిందని చెప్పడం విశేషం.  


ఇప్పుడు మరో వివాదాన్ని భుజాన వేసుకోవడానికి కంగనా సిద్ధం అవుతున్నది.  మెంటల్ హై క్యా సినిమా చేస్తున్న కంగనా.. అందులో కొన్ని సీన్లు నచ్చలేదట.  ఆ సీన్స్ ను మార్చేందుకు సిద్ధం అయ్యింది.  ప్రకాష్ రావు కోవెలమూడి దర్శకుడు.  అయన ఎలాంటి ఇగోలకు పోకుండా... కంగనా చెప్పినట్టు సరే అన్నాడని తెలుస్తోంది.  అందరు కలిసి పనిచేస్తేనే సినిమా బాగా వస్తుంది.  


కంగనా చెప్పిన పాయింట్ బాగుంది అందుకే ప్రొసీడ్ కావాలని చెప్పాను.  చెప్పినట్టుగా కంగనా సీన్స్ ను మార్చింది.  చాలా బాగా వచ్చింది అంటూ కంగనాకు మెచ్చుకున్నాడు.  ఇంతకీ కంగనా ఆ సీన్స్ ను మార్చడానికి కారణం ఏంటి అంటే.. రాజ్ కుమార్ రావు సీన్స్ కంగనాకు డామినేట్ చేసే విధంగా ఉండటమే.  


టాప్ హీరోలు అమీర్, సల్మాన్ లు దర్శకుడికి సలహాలు సూచనలు ఇస్తున్నప్పుడు.. కంగనా వంటి టాలెంటెడ్ హీరోయిన్ ఎందుకు సలహాలు ఇవ్వకూడదని అంటున్నాడు ప్రకాష్ రావు కోవెలమూడి. కందకు లేని దురద కత్తికి ఎందుకు చెప్పండి.  దర్శకుడు ప్రకాషే ఆమె దర్శకత్వం చేసేందుకు ఒప్పుకుంటే ఇంకేం మాట్లాడతారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: