రాజమౌళి ఓటమి ఎరుగని దర్శకధీరుడు..అని టాలీవుడ్ లో పేరుంది.  ఆయన తీసిన సినిమాలు చాలా తక్కువే అయినా ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  ఇక ఆయన కెరీర్ లో ప్రతిష్టాత్మక సినిమా ‘బాహుబలి, బాహుబలి2’.  ఈ సినిమాలు ఏకంగా ప్రపంచ స్థాయిలోనే రికార్డు మోత మోగించింది.  ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, రమ్యకృష్ణ కు ఎంతో పేరు వచ్చింది.  అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళికి జాగీత స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఆయన బాలీవుడ్,కోలీవుడ్ అన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తున్నారు. 

ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్, రాంచరణ్ ల మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’తెరకెక్కిస్తున్నారు.   ఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ మన్యం పోరాట యోధుడు కొమురంభీమ్ గా, రాంచరణ్ ఆంధ్ర మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నట్లు ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు.  అయితే ఈ ఇద్దరు హీరోలకు గాయం కారణంగా షూటింగ్ కొంత విరామం ఇచ్చారు.  త్వరలో ఈ సినిమా షూటింగ్ రెగ్యూలర్ గా జరగబోతుందట.  అయితే  ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశం ఒక రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇది ఒక భారీ పోరాట సన్నివేశామని తెలుస్తోంది. ఎన్టీఆర్ .. చరణ్ తో పాటు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ పోరాట సన్నివేశంలో పాల్గొననున్నట్టు సమాచారం. కేవలం ఈ ఒక్క పోరాట సన్నివేశం కోసం ఏకంగా 45 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట. అంతే కాదు  విజువల్ వండర్ గా అనిపించే ఈ సన్నివేశం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. జూలై 30 2020లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: