ప్రస్తుతం ఇండస్ట్రీలోని పెద్దలలో మెగా ఫ్యామిలీ మరియు అక్కినేని ఫ్యామిలీ భాగంగా ఉన్నాయి. ఈ రెండు ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.అలాంటి ఈ రెండు కుటుంబాల నుండి వచ్చిన హీరోలు ప్రస్తుతం కలిసి ఒకే చిత్రంలో నటించబోతున్నారు.దీనితో రెండు కుటుంబాల ఫ్యాన్స్ త్వరలో థియేటర్ ల దగ్గర సందడి చేయనున్నారు.

ఇక వివరాలలోకి వెళ్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన 19 వ చిత్రం చేస్తున్నారు.ఇందులో బన్నీకి జోడీగా పూజ హెగ్డే నటించినున్నది.గతంలో ఈ జోడీ డీ.జ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం లో టబు కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నారంట.మరో కీలక పాత్ర కోసం సుశాంత్ ని కల్సిరంట కథ మరియు పాత్ర బాగా నచ్చడంతో తను కూడా ఓకే చెప్పినట్టు సమాచారం

హీరోగా ఎన్నిసార్లు ప్రయత్నించిన విజయం అందుకోలేక పోయిన ఈ అక్కినేని వారసుడు కనీసం బన్నీ తో నైన విజయాన్ని అందుకొని గాడిలో పడుతాడో లేదో వేచి చూడాలి. ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలవ్వనుంది


మరింత సమాచారం తెలుసుకోండి: