తమన్నా సూపర్ యాక్ట్రెస్.. అందులో ఎలాంటి సందేహం లేదు.  తమన్నా చేసిన సినిమాలు టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి.  మంచి నటితో పాటు తమ్ము సూపర్ డ్యాన్సర్ కూడా.  హీరోతో సమానంగా స్టెప్స్ వేయగలదు.  స్వింగ్ జరా సాంగ్ కు తమన్నా స్టెప్స్ హైలైట్ అయ్యాయి.  అభినేత్రి 2 సినిమాలో కూడా ఇండియన్ స్పీడ్ డ్యాన్సర్ ప్రభుదేవాతో కలిసి నటించింది.  

అందులో తమ్ము స్టెప్స్ ఎలా ఉన్నాయో చెప్పక్కర్లేదు. తమన్నా స్టెప్స్ కు చాలామంది ఫిదా అయ్యారు.  అయితే, తమన్నా మనసులో ఓ కోరిక ఉందట.  ఎలాగైనా డాన్స్ ప్రాధాన్యత కలిగిన సినిమాలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటుంది.  ఇప్పటి వరకు అవకాశం దొరకలేదు.  సినిమాలు నుంచి రిటైర్ అయ్యేలోపు అలాంటి సినిమాలో నటించాలని అనుకుంటున్నట్టు తమన్నా చెప్పింది.

తమన్నా నటించిన కామోషి బాలీవుడ్ లో త్వరలోనే రిలీజ్ కాబోతున్నది. సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.  తమిళంలో సూపర్ హిట్టైన నయనతార సినిమాకు ఇది రీమేక్.  దీంతోపాటు తెలుగులో తాప్సి నటించిన ఆనందో బ్రహ్మ రీమేక్ సినిమాలో కూడా తమన్నా నటిస్తుండటం విశేషం.  

తమన్నా సినిమాలకు బాలీవుడ్ లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె నటించిన హిమ్మత్ వాలా అక్కడ ఫెయిల్ అయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఎఫ్ 2 సినిమా తరువాత తమన్నాకు తెలుగులో అవకాశాలు దొరక్కపోవడం విశేషం.  బహుశా ఇతర భాషలపై అందుకే దృష్టి పెట్టి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: