మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా సినిమాకు సంబంధించిన రూమర్లు వరసగా వస్తూనే ఉన్నాయి.  అవి ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.  సినిమాపై అంచనాలు ఉన్నాయి.  అయితే రిలీజ్ డేట్ పైనే ఇప్పుడు అందరికి అనుమానాలు ఉన్నాయి.  

ఈ సినిమా మొదలు అయ్యి ఇప్పటికే చాలా సమయం అవుతుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల పై ఇప్పటికీ క్లారిటీ లేదు. మొన్నటి వరకు ఈ సినిమా అక్టోబర్ లో విడుదల అవుతుంది అని వార్తలు వచ్చినా ఇప్పుడు ఈ సినిమా ఈ ఏడాది వచ్చేది లేదు అని పుకార్లు మళ్ళి షికారు చేస్తున్నాయి.ఇలా పుకార్లు రావడానికి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ అని అంటున్నారు.

సినిమాలో యుద్దాలు కి సంబందించిన సీన్లు చాలా ఉన్నాయి అని, వాటిని జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా కంప్లీట్ చేయాలంటే సమయం పడుతుంది అని, ఈ ఏడాది చివరి వరకు సమయం కావాలని విఎఫ్ఎక్స్ టీమ్ అడిగినట్టు సమాచారం.  

దీంతో సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.  దీనిపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేవరకు ఈ రూమర్లు ఇలానే వస్తుంటాయి.  ఈ రూమర్లకు చెక్ ఎప్పుడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: