151 సినిమాలకు దర్శకత్వం వహించి నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ‘రారాజు లా’ ఏలిన దాసరి నారాయణరావు జీవించి ఉన్నరోజులలో చేసిన పొరపాట్లు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడుగా టాప్ రేంజ్ లో ఉన్న సమయంలో దాసరి సినిమాలను పక్కకు పెట్టి రాజకీయాల బాటపట్టి ఆ రంగంలో తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయారు అన్నది ఓపెన్ సీక్రెట్.

రాజకీయాలకు తను పనికిరానని తెలుసుకుని తిరిగి యూటర్న్ తీసుకుని సినిమా దర్శకత్వం చేపట్టినా ఆయనను అప్పట్లో వరస పరాజయాలు పలకరించాయి. చివరి రోజులలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తీయాలని ప్రయత్నించి ఆ ప్రయత్నాలు పూర్తి కాకుండానే దాసరి చనిపోయారు. 

దాసరి దర్శకుడుగా ఉన్నతస్థాయిలో ఉన్న రోజులలో ఉదయం పత్రికను పెట్టి మొదట్లో 2.24 లక్షల కాపీలు అమ్మకం అయ్యే స్థితికి ఉదయం పేపరు ఎదిగి ఆతరువాత తీవ్రమైన ఆర్ధిక నష్టాలతో ఆపత్రిక మూతబడి దాసరికి ఒక పీడ కలలా మారింది. ఇప్పుడు పవన్ కూడ ఒక పత్రిక పెట్టబోతున్నాడు అని వస్తున్న వార్తలను చూసి చాలామంది పవన్ కూడ దాసరి అడుగుజాడలలో ఎందుకు పయనిస్తున్నాడు అంటూ కొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు.

దీనికితోడు ప్రస్తుతం న్యూస్ ఛానల్స్ సంఖ్య పెరిగిపోవడంతో పాటు సోషల్ మీడియా అందుబాటు అందరికీ చేరువైపోయింది. ఇలాంటి పరిస్థుతులలో ఒక పత్రిక నడపడం ఆర్ధికంగా ఏమంత  ప్రయోజనాన్ని కలిగించదు. ఇప్పటికే ఘోర ఓటమి పాలైన జనసేన పార్టీని ఆర్ధికంగా ఆదుకునే వ్యక్తులు లేని నేపధ్యంలో పవన్ పెట్టబోయే పత్రికకు ఎవరు ఆర్ధికంగా సహాయసహకారాలు అందిస్తారు అంటూ ఇండస్ట్రీలోని పవన్ సన్నిహితులు పవన్ ప్రయోగాల పై ఆయనకు జాగ్రత్తలు చెప్పాలని నిశ్చయించు కున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: