టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో రామ్ చరణ్ ఒకరు.  చరణ్ హీరోగా 12 సినిమాలు చేశాడు.  ఆర్ఆర్ఆర్ 13 వ సినిమా.  రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఇందులో హీరోగా చేస్తున్నాడు.  రాజమోళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం దాదాపుగా 350 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  

ఇదిలా ఉంటె, ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారు.  మరో రెండు మూడు రోజుల్లో రామ్ చరణ్ కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు.  జాయిన్ అయ్యాక ఇంటర్వెల్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తారట.  సమ్మర్ వెకేషన్ కోసం టాంజానియా వెళ్లిన రామ్ చరణ్... నిన్ననే అక్కడి నుంచి తిరిగి వచ్చారు.  

రామ్ చరణ్ కొత్త లుక్ కు సంబంధించిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.   పూర్తిగా బ్లాక్ అండ్ బ్లాక్ ట్రాక్ డ్రెస్ లో చెర్రీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్నారు. వైట్ టీస్ పై బ్లాక్ కోట్ ఆకట్టుకుంది. ఇక అతడు ఆర్ సీ పేరుతో క్యాప్ ని ధరించడం ఆసక్తికరం.

హైదరాబాద్ నుంచి షెడ్యూల్ ను అహ్మదాబాద్ కు మార్చినపుడు షూటింగ్ జరిగే సమయంలో సడెన్ గా రామ్ చరణ్ కు గాయం అయ్యింది.  దీంతో ఆరు వారల పాటు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.  రామ్ చరణ్, ఎన్టీఆర్ లు రెస్ట్ తీసుకున్నారు.  రెస్ట్ అనంతరం.. చరణ్ ఆఫ్రికా వెళ్లారు.  అక్కడి నుంచి నిన్ననే ఇండియాకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: