విజ‌య్ ఆంటోనీకి తెలుగులో మంచి గుర్తింపు, మార్కెట్ ఉంది. సంచ‌ల‌న విజ‌యం సాధించిన బిచ్చ‌గాడు త‌ర్వాత ఆయన తమిళంలో న‌టించే ప్ర‌తి సినిమా తెలుగులోనూ విడుద‌లవుతోంది. అయితే బిచ్చ‌గాడు త‌ర్వాత ఆయ‌న్నుంచి వ‌చ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాయి. కానీ విజ‌య్ ఆంటోనీ మాత్రం ప‌ట్టు వ‌ద‌ల‌కుండా రెండు భాష‌ల్ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ఈసారి అర్జున్‌తో క‌లిసి ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో ‘కిల్ల‌ర్‌’ చేశారు. మ‌రి ఆ చిత్రం ఎలా ఉంది? విజ‌య్ ఆంటోనీ ఖాతాలో బిచ్చ‌గాడు త‌ర్వాత మ‌రో విజ‌యం.

మరింత సమాచారం తెలుసుకోండి: