కైరా అద్వానీ అతి తక్కువ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపొయింది. రెగ్యులర్ గా ఏదో ఒక కొత్త ఫ్యాషన్ లేదా ట్రెండ్ ని ఫాలో అవుతూ జనాలకు ట్రీటిస్తేనే లైమ్ లైట్ లో ఉండగలం. ఈ విషయంలో ముంబై హాట్ గాళ్ కియరా అద్వానీ ఇతర నాయికలతో పోలిస్తే ఒక ఆకు ఎక్కువే తింది. ఇటీవల ముంబైలో ఏ ఫ్యాషన్ ఈవెంట్ జరిగినా అక్కడ కియరా అప్పియరెన్స్ తప్పనిసరి. పెట్రోమాక్స్ కాంతుల జిగిజిగిల నడుమ ర్యాంప్ వాక్ చేస్తూ దర్శనమిస్తోంది.


ప్రస్తుతం షాహిద్ సరసన నటించిన `కబీర్ సింగ్` చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న కియరా రోజుకో రకం ఫ్యాషన్ ట్రీట్ ఇస్తోంది.తాజా ఫోటోషూట్ లో ఓ ప్రత్యేకమైన డెనిమ్ స్కర్ట్ లో దర్శనమిచ్చింది. అంతమంది గార్డుల సమక్షంలో స్కర్టులో అగ్గి రాజేసింది. కాస్తంత పిక్కలపైకి తేలిపోతున్న ఈ స్కర్ట్ వీక్షకులకు బోలెడంత వీనులవిందు చేసిందిట.


కియరా స్కర్ట్ నే క్యాప్చుర్ చేసేందుకు అటు ఫ్యాన్స్ కళ్లు సహా ఇటు మీడియా కెమెరాలు పోటీ పడ్డాయి. బాటమ్ లోని స్కర్ట్ రంగుకి మ్యాచ్ చేస్తూ టాప్ లోని ఊదారంగు డిజైనర్ డ్రెస్ యూత్ ని మైమరిపించింది. కబీర్ సింగ్ గ్యారెంటీ హిట్ కొడుతుందన్న ధీమా కియరాలో కనిపిస్తోంది. మరోవైపు ఈ బ్యూటీ బాలీవుడ్ లో పలు క్రేజీ సినిమాలకు సంతకం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: