ఆర్ ఎక్స్ 100 సినిమా గుర్తుంది కదా.  అందులో పాయల్ రాజపుత్ తన బోల్డ్ యాక్టింగ్ తో అదరగొట్టింది.  అడల్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీసినిమాగా వచ్చిన ఈ మూవీ యూత్ ను ఆకట్టుకుంది.  కలెక్షన్ల వర్షంకురిసింది.  ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.  


ఇదిలా ఉంటె, ఆర్ఎక్స్ 100 తరువాత సినిమాల కోసం చాలా ట్రై చేసింది.  సీత సినిమాలో ఓ సాంగ్ చేసేందుకు మాత్రమే అవకాశం దొరికింది.  కాగా, ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో రెండు సినిమాలుఉన్నాయి .  అందులో ఒకటి వెంకటేష్ హీరోగా చేస్తున్న వెంకిమామ.  ఇందులో వెంకటేష్ కు జోడిగా ఆమె నటిస్తోంది.  


ఇక రెండో సినిమా టైగర్ నాగేశ్వర రావు బయోపిక్.  1980 దశకంలో కోస్తా ఏరియాను గడగదలందించిన గజదొంగ టైగర్ నాగేశ్వర రావు.  ఆయన ఏ దొంగతనమైనా చాలా ఈజీగా చేసేవాడు.  అందుకే ఆయనకు టైగర్ అనే బిరుదు ఇచ్చాడు.  స్టువర్ట్ పురంలో ఉండే ఈ టైగర్ గురించి ఆ చుట్టుపక్కల వాళ్లకు బాగా తెలుసు.

ఇందులో పాయల్ రాజ్ పుత్ వేశ్య పాత్రను చేస్తోంది.  ఈ బయోపిక్ షూటింగ్ ఆగష్టు నుండి షూట్ మొదలుకానుందని తెలుస్తోంది.మరి ఈ పాత్రలో పాయల్ ఎలా చేస్తుందో చూడాలి.  ఈ సినిమాతో పాటు రవితేజ డిస్కో రాజాలో కూడా పాయల్ నటిస్తుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: