ప్రియాంక చోప్రా డ్రెస్సింగ్ ఈ మధ్య చాలా వివాదాలకు దారి తీస్తుంది. ఏ డ్రెస్ ను ఎలాగైనా వేయొచ్చు . కానీ సంప్రదాయబద్దమైన చీర కట్టి జాకెట్ వేసుకోకుండా ప్రియాంక ఇచ్చిన ఫోజు ఇప్పుడు విమర్శలకు దారి తీస్తుంది. నువ్వు టాప్ లెస్ ఫోజులు ఇచ్చినా, మరేరకంగా ఫోజులు ఇచ్చుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అది నీ వ్యక్తిగతం. అయితే భారతీయ సంస్కృతికి చిహ్నమైన చీరకట్టును ప్రజెంట్ చేసేపుడు సరైన పద్దతిలో చేయ్.


జాకెట్ విప్పేసి చీర కట్టు పరువు తీసే పని మాత్రం చేయకు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ప్రియాంక చోప్రా చర్య భారతీయ సంస్కృతిని తప్పుతోవ పట్టించే విధంగా ఉందని మరికొందరు అంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఇండియన్ సారీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, ఆ గుర్తింపును చెడగొట్టే విధంగా ఆమె ప్రవర్తించింది, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోద యోగ్యం కాదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


ఈ ఫోటో షూట్లో ప్రియాంక చోప్రా ధరించిన చీరను తరుణ్ తహిల్యానీ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అయితే జాకెట్ లేకుండా ప్రియాంక చోప్రా ఫోజులు ఇవ్వడంపై ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. ఆ ఫోటో షూట్లో వల్గారిటీ ఏమీ లేదని సమర్ధించుకున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రాను విమర్శించే వారు ఒక వైపు ఉండగా.... ఆమెకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ఆ ఫోటో షూట్లో ప్రియాంక చాలా అందంగా కనిపించిందని, కొంపలు మునిగిపోయినట్లు ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: