మలైకా అరోరా .. లేట్ వయసులో హాట్ అందాలతో సెగలు కక్కిస్తుంది. ఒక పక్క అర్జున్ కపూర్ తో అఫైర్ నడుపుతూ మరో పక్క హాట్ ఫోజులతో రెచ్చిపోతుంది. ప్రస్తుతం మలైకా వయస్సు అక్షరాలా 45 సంవత్సరాలు. అప్పుడెప్పుడో బాలీవుడ్ మూవీ 'దిల్ సే'లో ''చలు ఛయ్య ఛయ్యా ఛయ్య'' అంటూ ప్రేక్షకులకు కొత్త మైకం పరిచయం చేసిన ఈ భామ నేటికీ తన అందాల్లో ఆవగింజంత మార్పు కూడా రానివ్వలేదు. 


తెలుగు ప్రేక్షకులకు కూడా మలైకా తన అందాలను రుచి చూపించింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన 'అతిథి' చిత్రంలో 'రాత్రైనా ఓకే.. పగలైతే డబుల్ ఓకే' అంటూ కుర్రకారులో హీటు పెంచి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాలో 'కెవ్వు కేక' అంటూ తన అందాలతో కేకలు పుట్టించింది. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముదురు భామ సోషల్ మీడియాను కూడా వదిలిపెట్టలేదు. యంగ్ హీరోయిన్లకు దీటుగా తన సెక్సీ పోజులను పోస్ట్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది.


ఈ నేపథ్యంలో తాజాగా ఓ సెన్సేషన్ పిక్ షేర్ చేసింది మలైకా. లైట్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్న సముద్రపు నీటిలో ఓ బ్యూటిఫుల్ జలకన్యలా బికినీలో దర్శనమిచ్చింది మలైకా అరోరా. జబ్బలు పైకెత్తి ఎద అందాలు చూపిస్తూ యమ హుషారుగా నీళ్ళను పైకి చిమ్ముతోంది ఈ 45 ప్లస్ సుందరి. కుర్రకారు మతిపోగొట్టేలా హాట్ గా ఉన్న ఈ పిక్ చూసి మలైకా వయసు 45 అని ఎవ్వరూ అనుకోలేరు. పాతికేళ్ల సుందరీమణిలో ఉన్న అందం, దానికి తగ్గ జోష్ ఆమెలో కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: