శ్రీలంక నుంచి బాలీవుడ్ కు వచ్చి సెటిల్ అయిన హీరోయిన్లలో జాక్వెలిన్ ఒకరు.  వచ్చి రాగానే కండలవీరుడు సల్మాన్ తో సినిమాలు చేసింది.  మంచి హిట్ కొట్టింది.  అయితే, గతేడాది ఎన్నో  ఆశలు పెట్టుకున్న రేస్ 3 దూసుకెళ్లలేకపోయింది.  ఆ తరువాత గతేడాది మరే సినిమా చేయలేదు.  


ప్రస్తుతం  డ్రైవ్ అనే సినిమాచేస్తోంది.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజపుత్ హీరో.  ఈ సినిమా కోసం జాక్వెలిన్ విపరీతంగా కష్టపడుతోంది.  జిమ్ కు వెళ్లి తన షేప్ ను మార్చెసింది.  చూసిన వాళ్లకు బాబోయ్ ఇది జాక్వెలినా నా కదా అనేంతగా మారిపోయింది.  


అలా మారిపోయిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఇంకేముంది క్షణాల్లో ఆ ఫోటో వైరల్ గా మారింది.  ఎక్కడ చూసినా ఇప్పుడు ఆ ఫోటోనే దర్శనంఇస్తోంది .  డ్రైవ్ సినిమాతో దశ మారుతుంది అని భావిస్తున్నది జాక్వెలిన్.  


సల్మాన్ తో మొదట్లో హిట్ కొట్టినా.. రేస్ 3 తో పాపం ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా డల్ అయ్యింది.  ఎలాగైనా హిట్ కొట్టి మరలా రేస్ లోకి రావాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ.  శ్రీలంక అందం.  పైగా మంచి రూపం. గ్లామర్ కు  అడ్డు చెప్పని వైనం. ఇంకేముంది మరో సినిమా హిట్టయితే చాలు.  దూసుకుపోవడమే.  


మరింత సమాచారం తెలుసుకోండి: