గత పదేళ్ళ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా అభివృద్ది చెందింది.కొత్త కొత్త టెక్నాలజీలు సినీ ఇండస్ట్రీ లోకి అందుబాటులోకి వచ్చాయి. కొత్త కొత్త కథలతో నవతరం దర్శకులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. మరపురాని విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే

 

కానీ కొందరు దర్శకులు మాత్రం ఏం మారలేదు. అవే రోటీన్ సినిమాలతో సినిమాకెళ్ళిన ప్రేక్షకులకు టార్చర్ చూపిస్తున్నారు. అర్థం లేని కథా కథనాలతో ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తున్నారు . ఎందుకు సినిమాలు హిట్టవుతున్నాయో అర్థం చేసుకోలేక ప్రేక్షకులపై బూతు సినిమాల్ని అనవసరంగా రుద్దుతున్నారు.

 

ఈ వారం రిలీజైన సినిమాలు హిప్పీ 7 రెండూ ప్రేక్షకులకు చుక్కలు చూపించాయి. అర్థం పర్థం లేని కథతో బూతు కామెడీ తో సినిమాల విలువను దిగజారుస్తున్నాయి ఈ సినిమాలు. ఇలాంటి సినిమాల వల్ల నిర్మాతలకు భారీ నష్టాలు తప్ప మిగతా ఎవరీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సినిమా వలన హీరో కార్తికేయ ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో ఇప్పుడు అంతే వ్యతిరేఖతను మూట గట్టుకుంటున్నాడు


మరింత సమాచారం తెలుసుకోండి: