2020 సంక్రాంతి పోరు రసవత్తరంగా ఉండబోతుంది. మహేశ్ బాబు అనిల్ రావిపూడి కాంబో మూవీ సంక్రాంతి టార్గెట్ గా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కూడా సంక్రాంతి టార్గెట్తో శరవేగంగా తయారు చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉండటంతో ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా ఉండబోతుంది.


ఈ సినిమాలతో పాటు బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా కూడా సంక్రాంతి లోపు సిద్దం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు సంక్రాంతికి విడుదలై హిట్టు కొట్టడంతో బాలకృష్ణ ఈ సెంటిమెంట్ కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాకు నిర్మాత ఫైనలైజ్ కాకపోవటంతో షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.


ఇప్పటికి ఈ మూడు సినిమాలు ఓకె కాగా సంక్రాంతి సమయానికి మరో రెండు సినిమాలు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ముగ్గురు టాప్ హీరోల సినిమాల్లో మూడు సినిమాలకు స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. సంక్రాంతి సమయంలో ఏ మాత్రం పాజిటివ్ టాక్ సినిమా రికార్డుల మోత మోగిస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: