విజయ్ ఆంటోని సంగీత దర్శకుడిగా కెరీర్ ఆరంభించి హీరోగా మారాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తమిళంతో పాటు తెలుగులోను ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ ఆంటోని నకిలీ సినిమాతో తెలుగులో తన కెరీర్ ఆరంభించాడు. ఆ తరువాత డాక్టర్ సలీమ్ సినిమా తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది.


కానీ బిచ్చగాడు సినిమా మాత్రం విజయ్ ఆంటోని ను ఒక స్థాయిలో నిలబెట్టింది. బ్రహ్మోత్సవం సినిమా సమయంలో విడుదలైంది. బ్రహ్మోత్సవం ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా బిచ్చగాడు బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. కోటిన్నర పెట్టి రైట్స్ కొన్న నిర్మాతకు 20 కోట్ల వసూళ్ళు తెలుగులో తెచ్చిపెట్టింది ఈ సినిమా


ఈ సినిమా తరువాత విజయ్ ఆంటోని నటించిన బేతాళుడు , యమన్, ఇంద్రసేన, రోషగాడు సినిమాలు వరుస డిజాస్టర్లుగా మారి విజయ్ ఆంటోని మార్కెట్ దెబ్బ తీసాయి. ఇటీవల రిలీజైన కిల్లర్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు విజయ్ సినిమాను పట్టించుకునేవారు లేకపోవటంతో సినిమా కలెక్షన్లు ఘోరంగా ఉన్నాయి. వీకెండ్లోనైనా ఈ సినిమా ఫలితం మారుతుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: