ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయ్యింది.  సింగిల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉన్నట్టు లేటెస్ట్ న్యూస్ ను బట్టి తెలుస్తోంది.  ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కావాలి.  అంటే ఇంకా సరిగ్గా  మాత్రమే సమయం ఉన్నది.  ఈ సాంగ్ షూటింగ్ కు ఎంత లేదన్న  నాలుగైదు రోజులు సమయం తీసుకుంటుంది.  


హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్న సినిమా కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పక్కాగా ఉండాలి.  ఏ మాత్రం తేడా వచ్చినా దెబ్బ కొడుతోంది.  అంతేకాదు,  సాంగ్స్  కూడా అదే రేంజ్ లో ఉండాలి.  ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు అందరు అనుకుంటుంది ఒక్కటే.. లావిష్ గా, కలర్ఫుల్ గా, హాలీవుడ్ సినిమాలా ఉండాలని.  


ఈ సినిమా అలాగే  ఉంటుందని అందరు అనుకుంటున్నారు.  ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంటున్నారు కాబట్టి సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్ అవసరం.  పైగా ఇది పాన్ ఇండియన్ మూవీ.  హిందీ తో పాటు దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజ్ కాబోతున్నది.  సో, ఈ రెండునెలలు ప్రభాస్ అండ్ కో ప్రమోషన్స్ విషయంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.  


దాదాపు ఈ సినిమాకు రూ. 200 కోట్లు ఖర్చు చేశారు.  కనీసం ప్రీ రిలీజ్ బిజినెస్ 300 కోట్లయినా చేయాలి.  అలాగే  వసూళ్లు 500 కోట్లు వరకు ఉండాలి.  అప్పుడే సినిమాకు ప్లస్ అవుతుంది.  ప్రభాస్ రేంజ్ ఏంటో నిజంగా అర్ధం అవుతుంది.  రేస్ 3 సినిమా కూడా ఇదే అంచనాలతో వచ్చింది.  కానీ చివరకు బోల్తా కొట్టింది.  మరి ప్రభాస్ ఏం చేస్తాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: