‘ఫలక్ నుమా దాస్’  మూవీ ఫెయిల్ అయినప్పటికీ ఆసినిమా సక్సస్స్ అంటూ సక్సెస్స్ మీట్ నిర్వహించడమే కాకుండా ఆ సక్సెస్స్ మీట్ లో ఈయంగ్ హీరో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మరాయి. ఒక వైపు సోషల్ మీడియాలో తన పై భారీఎత్తున ట్రోల్ నడుస్తున్నప్పటికీ ఈ నటుడు తను అనుకున్నది చెప్పేస్తున్నాడు.

తనను తొక్కడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని కానీ అలా తొక్కించుకోవడానికి తను కోకోకోలా టిన్ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తనకు అభిమానుల సపోర్ట్ ఉందనీ దానితో తనను ఎవరు ఏమి చేయలేరనీ చెపుతూ ఎవరైనా తొక్కేయడానికి తాను కాల్చి పడేసిన సిగరెట్ పీక అనుకున్నారా అంటూ ఆవేశంగా కామెంట్స్ చేసాడు.

దీనితో ఈ నటుడుకు ఏమైంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు తాను మరో సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెపుతూ ఇప్పుడు తాను ఇచ్చింది దమ్కీ మాత్రమేనని త్వరలో షాక్ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ‘ఫలక్ నుమా దాస్’ సెకండ్ ఆఫ్ సాగదీసినట్లు వచ్చిన విమర్శలను స్వీకరిస్తూ ఇప్పుడు ఆసినిమాను ట్రిమ్ చేసామని ఇప్పుడు ఆసినిమాను చూడమని ప్రేక్షకులను విశ్వక్ సేన్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. 

అయితే ఇప్పటికే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సినిమాను ఇప్పుడు మళ్ళీ ఎవరు చూస్తారు అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. మరికొందరైతే తన సినిమా ఫెయిల్ అయినప్పటికీ మీడియాలో వార్తలలో ఉండటానికి ఇలా విశ్వక్ సేన్ అనవసరమైన వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నాడు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: