‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం  `నేనే కేడీ నెం`1’.  ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై  ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో  జాని   స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.  ముస్కాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్  కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం సెన్సార్ ప‌నులు జ‌రుపుకుంటోంది. జూన్ చివ‌రి వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ  సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత జాని మాట్లాడుతూ...‘‘అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా `నేనే కేడి నెం-1` చిత్రాన్ని తెర‌కెక్కించాం.

ష‌క‌ల‌క శంక‌ర్ లోని మ‌రోకోణం మా సినిమాలో చూపించాం.  ఆడియ‌న్స్ కు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ జోడించాం. హీరోయిన్ గా ముస్కాన్ అందం, అభిన‌యం  అలాగే ముకుల్ దేవ్, పృథ్వీ పాత్ర‌లు సినిమాకు  స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తాయి.  ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. జూన్ చివ‌రి వారంలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. 


 ముకుల్ దేవ్, పృథ్వీ, పూజా, పి.డి.రాజు, క‌రాటే క‌ళ్యాణి, రాం జ‌గ‌న్, రాజేంద‌ర్, నాగ మ‌హేష్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి  సంగీతంః అజ‌య్ ప‌ట్నాయ‌క్‌;  కెమెరాః శ్రావ‌ణ్ కుమార్;  ఎడిట‌ర్ః స‌ములేటి శ్రీనివాస్ ;  స్టోరీ - స్క్రీన్ ప్లే-డైలాగ్స్-ద‌ర్శ‌క‌త్వం- నిర్మాతః జాని.


మరింత సమాచారం తెలుసుకోండి: