సినిమా పరిశ్రమలో ఎవరైనా నటుడు లేదా నటి ఒక హిట్ సాధించారంటే, అనంతరం వారి నుండి రాబోయే సినిమాలపై అంచనాలు మరింతగా పెరుగుతాయి అనే విషయం తెలిసిందే. ఇక 2016లో బిచ్చగాడు సినిమాతో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని దక్కించుకున్న నటుడు విజయ్ అంథోని. అయితే ఆ హిట్ తరువాత ఇప్పటివరకు వరుసగా వచ్చిన అయన సినిమాలేవీ కూడా పెద్దగా ఆడలేదు. 

నిజానికి బిచ్చగాడు సినిమా విజయ్ కి ఎంత ప్లస్ అయిందో అంతే మైనస్ కూడా అయిందని ఇప్పటికీ కొందరు సినిమా విశ్లేషకులు అంటూ ఉంటారు. ఇకపోతే నిన్న విజయ్ హీరోగా సీనియర్ నటుడు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా కిల్లర్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ సమయంలో విజయ్ ఒక్క మాట మాత్రం చెప్పడం జరిగింది. ఈ సినిమాతో నాకు మంచి హిట్ లభిస్తుంది అని, అయితే అయన అనుకున్న విధంగానే అటు తమిళ్ మరియు ఇటు తెలుగులో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

అంతేకాదు ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింత మంచి టాక్ మరియు కలెక్షన్లు సంపాదించే అవకాశాము ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఆద్యంతం ఎంతో ఆకట్టుకునేలా రూపొందించాడట దర్శకుడు ఆండ్రూ లూయిస్. సినిమాలో సందర్భానుసారం వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవ్వడం వల్లనే సినిమాకు మంచి టాక్ వచ్చిందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి మళ్ళి మూడేళ్ళ తరువాత హిట్ అందుకున్న విజయ్, ఈ హిట్ ని ఇలాగే కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: