ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించిన హిప్పీ సినిమా జూన్ 6 వ తేదీన రిలీజ్ అయ్యింది.  బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిఫరెంట్ టాక్ ను సొంతం చేసుకుంది.  సినిమాలో యూత్ కు నచ్చే బోల్డ్ కంటెంట్ బోలెడు ఉంది.  ఈ బోల్డ్ కంటెంట్ కు యూత్ ఫిదా అయ్యింది.  బోల్డ్ సన్నివేశాల్లో హీరోయిన్ దిగంగదా బోల్డ్ గా నటించి మెప్పించింది. కథ డిమాండ్ మేరకే ఆమె అలా నటించిందట.  

అలాగే హిప్పీ లో ఆముక్తమాల్యద పాత్ర తనకు బాగా నచ్చిందని, నటనకు చాలా అవకాశం ఉన్న పాత్ర దొరికినందుకు ఆనందంగా ఉంది అన్నారు. మహేష్,అల్లు అర్జున సినిమాలు టీవీ లో చూస్తాను అని చెప్పిన ఈ అమ్మడికి రాజమౌళి అంటే చాలా ఇష్టం అంట. ఆయన తీసిన బాహుబలి మూవీ ని ఆరుసార్లు చూసిందట. 

సల్మాన్ ఆమెకు బాగా తెలిసినా ఆఫర్స్ కొరకు ఆయన సిపారసు తీసుకోను అని ఇలా అనేక విషయాలు చెప్పుకొచ్చారు. సినిమాలో ఇప్పుడు బోల్డ్ సన్నివేశాలు లేకుండా సినిమా రావడం లేదు.  అవి ఉంటేనే సినిమా చూస్తున్నారు.  అందుకే అందరు అలాంటి కథల వైపుకే మొగ్గు చూపుతున్నారు.  

అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన తరువాత  ఈ సంస్కృతీ వచ్చింది.  వరసగా అలాంటి సినిమాలే వస్తున్నాయి.  సినిమాలో కంటెంట్ లేకుండా కేవలం బోల్డ్ సన్నివేశాలను మాత్రమే ఉంచి సినిమా తీస్తే ఉపయోగం ఏముంటుంది చెప్పండి.


మరింత సమాచారం తెలుసుకోండి: