ప్రియాంక చోప్రా ఇండియన్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్.  అందులో  ఎలాంటి సందేహం అవసరం లేదు.  నిక్ జోనస్ వివాహం చేసుకొని హాలీవుడ్ కు వెళ్లిన తరువాత లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసింది.  ఇండియన్ ట్రెడిషనల్ లుక్ కు మోడ్రన్ హంగులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.  అలాంటి డ్రెస్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు.. అలాంటి డ్రెస్ లతో ఫోటో షూట్ లు కూడా చేస్తోంది.  

చేస్తే చెయ్యొచ్చుగాని.. అలా చేసే ఫోటో షూట్ లు ఒక్కోసారి మిస్ ఫైర్ అవుతుంటాయి.  ఇప్పుడు ప్రియాంక లేటెస్ట్ ఫోటో షూట్ విషయంలో అదే జరిగింది.  ఇన్ స్టైల్ అనే మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోజులు ఇచ్చింది.  అంతవరకూ బాగానే ఉంది.  చీరకట్టులో భారతీయ సంప్రదాయం కనిపిస్తుంది.  సంప్రదాయాన్ని ఎన్ని రకాలుగానైనా మలుచుకోవచ్చు.  

కానీ, శృతిమించి విధంగా చేస్తే మాత్రం అది ఇబ్బందిగా మారుతుంది.  చీరకట్టుకొని ఫోజులు ఇచ్చిన ప్రియాంక విషయంలో అదే జరిగింది.  చీర వరకు ఒకే జాకెట్ లేకుండా అలా ఫోజులు ఇవ్వడం ఏంటి అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  అది ట్రెడిషనల్ కాదని,ఇండియా పరువు తీసేసింది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  

ప్రియాంక డ్రెస్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కనీసం దానిపై వివరణ కూడా ఇవ్వలేదు ప్రియాంక.  మరి ఈ ట్రోలింగ్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.  ప్రస్తుతం బాలీవుడ్ లో స్కై  ఈజ్ పింక్ అనే సినిమా చేస్తోంది.  హాలీవుడ్ లో కొన్ని సినిమాలకు ఇప్పటికే సైన్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: