చాలా కాలం తరువాత తేజ రానా తో నేనేరాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టాడు.  ఈ సినిమాను విమర్శకులు సైతం మెచ్చుకున్నారు.  చాలామంది క్లైమాక్స్ బాగాలేదని అన్నా కథ ప్రకారం అదే కరెక్ట్ కాబట్టి సినిమా హిట్టైంది.  అదే కథలో మహేష్ లేదంటే.. ప్రభాస్ ఉండి ఉంటె సినిమా ఖచ్చితంగా ప్లాప్ అయ్యేదని తేజా ఇటీవలే అన్నాడు.  


పెద్ద హీరోలతో యాంటీ క్లైమాక్స్, సాడ్ క్లైమాక్స్ లు ఎప్పుడు వర్కౌట్ కావు.  పైగా ఇలా చేయడం వలన హీరోల ఇమేజ్ తగ్గిపోతుంది.  అందుకే తన కథల కోసం హీరోలను ఎంచుకుంటా అని అంటున్నాడు తేజ.  నేనే రాజు నేనే మంత్రి విషయంలో సక్సెస్ అయినా తేజ..సీత దగ్గరికి వచ్చే సరికి ఫెయిల్ అయ్యాడు.  


హిట్ ఫెయిల్యూర్ అన్నవి మన చేతుల్లో ఉండవని మనం మన పనిని చేసుకుంటూ వెళ్లడమే అంటున్నాడు.  సినిమా హిట్ అయితే మరో మంచి సినిమా చేయడానికి అవకాశం దొరుకుతుంది.  అదే ఫెయిల్ అయితే.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి సినిమా చేయడానికి మార్గం దొరుకుంటుందని అన్నాడు తేజ.  


ఈ స్ట్రెయిట్ ఫార్వార్డ్ కారణంగానే తేజ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కులేక పోతున్నాడు.   అందరిలా కమర్షియల్ హిట్స్ కొట్టలేకపోతున్నాడు.  ఒకసారి కథ ఫిక్స్ అయ్యాక కథను మార్చమన్నా మార్చాడు తేజ.  అందుకే తాజాతో పెద్ద హీరోలు సినిమాలు చేయడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: