అక్కినేని కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు.  అందులో నాగార్జున, చైతన్యలు మాత్రమే ఇప్పటి వరకు సెట్ అయ్యారు.  అఖిల్ హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.  సుమంత్ కు మంచి సినిమాలు రావడం లేదు.  సినిమా చేసినా పెద్దగా హిట్ కావడం లేదు.  


మరో అక్కినేని హీరో సుశాంత్ మంచి సినిమాలే చేశాడు.  తన ఖాతాలో మంచి హిట్స్ ఉన్నాయి.  కానీ, స్టార్ హీరోగా ఎదిగేంత టాప్ సినిమాలు కావుఅవి.  ఇప్పుడు ఈ హీరోకు బన్నీ సినిమా నుంచి అఫర్ వచ్చింది.  త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో సుశాంత్ ఓ కీలక రోల్ చేస్తున్నాడట.  


ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.  ఇందులో సుశాంత్ పాత్ర నిడివి ఎంత.. ఎలాంటి పాత్ర ఉంటుంది.  అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్.  సుశాంత్ కు వచ్చిన అఫర్ మంచిదే.  కానీ, బన్నీ హీరో కాబట్టి స్పేస్ అంటా బన్నీతోనే నిండిపోతుంది. 


సుశాంత్ కు స్పేస్ ఎక్కడ ఉంటుందో తెలియడం లేదు.  సుశాంత్ కు ఎన్ని సీన్స్ ఉంటాయో దానిని బట్టి ఆయన పాత్ర హైలైట్ అవుతుంది.  మహర్షిలో అల్లరి నరేష్ కు పడినట్టుగా మంచి సీన్స్ పడితే.. సుశాంత్ తిరిగి గాడిలో పడతాడు.  లేదు ఎదో ముక్తసరిగా చిన్న పాత్రతో సరిపెట్ట వలసి వస్తే ఏం చేయలేం. 


మరింత సమాచారం తెలుసుకోండి: