టాలీవుడ్ ఒక్కటే కదా రెండు ఎందుకు అన్న ప్రశ్నలోనే జవాబు కూడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నపుడు రెండు టాలీవుడ్లు అవసరమే కదా. ఏపీలో ఉన్న వారు, కళాకారులు, రచయితలు, టెక్నీషియన్లు  సినిమాల్లో పనిచేయడానికి హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి. హ్యాపీగా విశాఖలోనే, రాజమండ్రీలోనే స్టూడియోలు కడితే అక్కడే కొత్త కళాకారులు పనిచేస్తారు కదా.


అలాగే ఎంతో మందికి ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తుంది కదా. మరి ఈ సంగతి ఏలిన పెద్దలకు అర్ధమైతే ఎపుడో సినీ పరిశ్రమ ఏపీలోనూ వేళ్ళూనుకునేది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజికవర్గం వారే టాలీవుడ్లో ఎక్కువ అయినా అయన మాత్రం సీఎం గా ఏపీలో టాలీవుడ్ ని ఏర్పాటు చేసేందుకు ఎటువంటి చర్యలూ  తీసుకోలేదు.


ఇపుడు యంగ్ అండ్ డైనమిక్ సీఎం జగన్ వచ్చారు. ఆయనదంతా జెట్ స్పీడ్. అందువల్ల ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ ఏర్పాటు ఈసారి ఖాయమని టాలీవుడ్ పెద్దలే  అంటున్నారు. మంచి ముహూర్తం చూసుకుని టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి  జగన్ని కలవాలనుకుంటున్నారుట. ఆయనతో సినీ పరిశ్రమ అభివ్రుధ్ధిపై చర్చిస్తారట. ఇక జగన్ దగ్గర ఎస్ అన్న మాటే తప్ప నో అన్నది ఉండదు. దాంతో టాలీవుడ్ ఏపీలో కూడా వికసించేందుకు రంగం సిధ్ధమైపోతుందన్నమాటే.


మరింత సమాచారం తెలుసుకోండి: