లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమా చూసిన వాళ్లకు ఆర్లాండో గుర్తుంటాడు. ఆ సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులకు అయన బాగా దగ్గరయ్యాడు. ఈ నటుడి దగ్గర సిది అనే కుక్క ఉండేది. ఈ కుక్క ఆయన దగ్గరకు రావడం వెనుక ఓ పెద్ద కథ ఉంది. దీన్ని చిన్నతనం నుంచి పెంచుకోలేదు.
2004 వ సంవత్సరంలో ఆర్లాండోని ఈ కుక్క ఓ ప్రమాదం నుంచి కాపాడింది. అప్పటి నుంచి ఆ కుక్కను చేరదీసి పెంచడం స్టార్ట్ చేశాడు. ఆ కుక్కను ప్రాణంగా పెంచుకున్నాడు. అయితే, అది 2015 లో అనారోగ్యం కారణంగా మరణించింది. దీంతో ఆర్లాండో కుంగిపోయాడు.
చనిపోయిన సిది ని తలుచుకుంటూ చాలా రోజులు డిప్రెస్ లోకివెళ్లిపోయారు . తరువాత ఏమైందో ఏమోతెలియదు . ఇంటి ముందు ఆర్లాండో అస్థిపంజరం వచ్చింది. ఆర్లాండో ప్రతి రోజు ఆ అస్తిపంజరానికి గుడ్ నైట్ చెప్పి నిద్రపోయేవాడట.
ఇప్పటికి సిది తననతోనే ఉంటుందని అంటున్నాడు ఈ హాలీవుడ్ నటుడు. పెంపుడు జంతువులు చనిపోతే ఆ బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. ఆర్లాండో విషయంలో ఇది మరింత ఎక్కువ. ఎందుకంటే అది అతడిని ప్రమాదం నుంచి కాపాడింది కదా మరి.