ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెడతారు కొంతమంది హీరోలు. టాలెంట్ పుష్కలంగా ఉండటంతో సరైన కథను ఎంచుకోవటంతో కెరీర్ మొదట్లో భారీ హిట్టు కొడతారు. ఆ హిట్టును చూసి నిర్మాతలు కోట్లకు కోట్లు పారితోషికం ఇస్తామని చెప్పటంతో సరైన కథలకు ప్రాధాన్యం ఇవ్వక డిజాస్టర్లు కొట్టి ఇండస్ట్రీ నుండి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు

ఇలా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా చెలమణి అయ్యే అవకాశం ఉండి కూడా కెరీర్ ను సరిగ్గా నిర్మించుకోలేకపోతున్నారు కొంతమంది హీరోలు.ఈ లిస్ట్లో మొదట చెప్పుకోవాల్సింది హీరో ఉదయ్ కిరణ్ గురించి. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన ఉదయ్ కిరణ్ కెరీర్లో సరైన విజయాలు లేక ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది . తరుణ్ కూడా నువ్వే కావాలి నువ్వే నువ్వే లాంటి విజయాల తరువాత వరుస ఫ్లాపులతో సినిమా ఇండస్ట్రీ కే దూరం అయ్యాడు. ఈ లిస్ట్లో తరువాత స్థానం హీరో వరుణ్ సందిశ్ ది.

హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం సినిమాలతో హిట్లు కొట్టిన వరుణ్ ఎన్ని ఫ్లాపులు ఇచ్చాడో లెక్కే లేదు. ప్రస్తుత యువహీరోల పరిస్థితి ఇలాగే ఉంది . ఛలోతో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ శౌర్య వరుసగా మూడు ఫ్లాపులు ఇచ్చాడు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో హిట్టు కొట్టిన కార్తికేయ హిప్పీ సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పటికైనా జాగ్రత్త పడకపొతే ఈ యువ హీరోలు తెలుగు తెర మీద నుండి త్వరలోనే అదృశ్యమయ్యే ప్రమాణం ఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: