వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు ఎన్టీయార్. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు ఎవరు ఈ స్థాయిలో వరుస హిట్లు కొట్టలేదు. ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీయార్ తన తరువాత ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

ఎస్ ఎస్ రాజమౌళి సినిమా తరువాత ఎన్టీయార్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ అరవింద సమేత తరువాతే మొదలు కావాల్సి ఉన్నా రాజమౌళి తన సినిమాలో ఎన్టీయార్ ను హీరోగా తీసుకోవటంతో ఈ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమానే కాక తమిళ దర్శకుడు అట్లీ చెప్పిన లైన్ కు ఎన్టీయార్ ఓకె చెప్పాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని తెలుస్తుంది

 

ఈ సినిమాలు కాకుండా కేజీఎఫ్ 2 తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలో ఎన్టీయార్ హీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . ఈ సినిమాకు కథాపరమైన చర్చలు జరగనప్పటికీ ఇండియా అంతా క్రేజ్ ఉన్న దర్శకుడు కాబట్టి ఎన్టీయార్ నో చెప్పే అవకాశమైతే లేదు. మొత్తానికి ఎన్టీయార్ తన కెరీర్ ను సరిగ్గానే బిల్డ్ చేసుకుంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: