ఈ మధ్య ప్రియాంక చోప్రా బ్లౌస్ వేసుకోకుండా చీరలో ఫోటోలు దిగిన సంగతీ తెలిసిందే. దీని మీద పలువురు విమర్శలు చేసిన సంగతీ తెలిసిందే. జాకెట్ లేకుండా టాప్ లెస్‌గా ఆమె ఫోజులు ఇవ్వడంతో 'భారతీయ సంస్కృతికి చిహ్నమైన చీకట్టును అవహేళన చేస్తున్నావు' అంటూ కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ వివాదంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.


ప్రియాంక ఫోటో షూట్లో వల్గారిటీ ఏమీ లేదని, ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముందని కొందరు వాదిస్తుండగా, మన కల్చర్ తప్పుతోవ పట్టిస్తున్నారంటూ మరికొందరు సాంప్రదాయ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రియాంక ఫోటో షూట్ మీద ఇంటర్నెట్లో జరుగుతున్న రాద్దాంపై... ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆసక్తికర కథనం వెలవరించింది. పురాతన భారతంలో రవికె(బ్లౌజ్) లేకుండానే చీర ధరించేవారు.


తర్వాత క్రమక్రమంగా రవికె ధరించడం వాడుకలోకి వచ్చింది. ప్రియాంక చోప్రా ఫోటో షూట్ మీద అంతరాద్దాం చేయాల్సిన అవసరం ఏముంది? అంటూ తన కథనంలో పేర్కొంది. ప్రియాంక చోప్రాకు సపోర్టుగా వచ్చిన ఈ కథనం యాంకర్ రష్మి కి చాలా నచ్చింది. దాన్ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇలా చేయడం ద్వారా మహిళల వస్త్రధారణపై ఎవరికీ ఎలాంటి కామెంట్స్ చేసే హక్కు లేదు అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు రష్మి. 

మరింత సమాచారం తెలుసుకోండి: