ఈ రోజులో హీరోయిన్స్ అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గడం లేదు. స్కిన్ షో చూపిస్తూ కుర్రకారుకు రెచ్చగొడుతున్నారు. తాజాగా చి.ల.సౌ ఫేం.. యంగ్ బ్యూటీ రుహానీ శర్మ సోషల్ మీడియాలో టచ్ లోకొచ్చింది. ఈ భామ తాజా పోస్టింగ్ జోరుగా వైరల్ అవుతోంది. రుహాని నటించిన తొలి సినిమా `చి.ల.సౌ` బాక్సాఫీస్ వద్ద ఆశించినంత పెద్ద సక్సెస్ సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.


సుశాంత్ - రుహానీ జంట నటనకు పేరొచ్చింది. ఆ సినిమాలో సింపుల్ మిడిల్ క్లాస్ గాళ్ పాత్రలో రుహానీ చక్కని అభినయం కనబరిచింది. అయినా ఎందుకనో ఈ అమ్మడు రెండో అవకాశం అందుకోవడంలో మాత్రం తడబడుతోంది. చి.ల.సౌ రిలీజై ఇంతకాలమైనా ఇంకా తెలుగులో వేరొక సినిమాకి సంతకం చేయలేదు. కనీసం ఇతర పరిశ్రమల్లో అయినా ఏ అవకాశం అందుకుందో తెలీదు.చి.ల.సౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రెండో సినిమాతో బిజీ బిజీ.


రాహుల్ ప్రస్తుతం నాగార్జున హీరోగా `మన్మధుడు2` తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కనీసం ఈ చిత్రంలో అతిధి పాత్రకు అయినా రుహానీ పేరును పరిశీలించలేదా? అన్నది చూడాలి. అయితే రుహానీలో గ్రేసు- స్పీడు చూసైనా మునుముందు అక్కినేని కాంపౌండ్ పిలిచి అవకాశాలిస్తుందేమో! అందానికి అందం .. వేడెక్కించే వయ్యారం ఈ భామలో కొదవేమీ లేదని తాజా పోస్ట్ చెప్పకనే చెబుతోంది. మిల్కీ ప్లస్ మిల్కీ స్క్వేర్ అన్నట్టే చెలరేగుతోంది ఈ బ్యూటీ!

మరింత సమాచారం తెలుసుకోండి: