మంగళగిరిలో నిన్న పవన్ కళ్యాణ్ తన జనసైనికులతో మాట్లాడుతూ ఉద్వేగపూరితమైన ఉపన్యాసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘జనసేన’  ఘోర పరాజయం పవన్ ను ఏ స్థాయిలో నిరాశ పరిచిందో పవన్ మాటలలోని ఆవేదన బట్టి అర్ధం అవుతుంది. 

తనకు ఓటమిలు కొత్త కాదనీ ఓటమి వచ్చే కొద్దీ కసి పెరిగి తాను గెలుపు కోసం ప్రయత్నిస్తానని అంటూ దెబ్బలు తినడానికే తను రాజకీయాలలోకి వచ్చిన విషయాన్ని వివరించాడు. అంతేకాదు తనను రాజకీయాలలోకి రాకుండా ప్రయత్నించడానికి ఎలాంటి శక్తి తనను ఆపలేదనీ కామెంట్స్ చేసాడు. రాహువు పట్టిన పట్టు ఒక సెకన్ అయినప్పటికీ గ్రహణ సమయంలో చీకటి కమ్మినట్లుగా తాను పట్టిన పట్టుతో తిరిగి చంద్రుడులా ప్రకాశిస్తాను అంటూ కామెంట్స్ చేసాడు.

ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ ఓటమి వచ్చినప్పుడే ఎవరు సన్నిహితులు మరెవ్వరు శత్రువులు అన్న విషయం క్లారిటీ వస్తుందనీ తనకు ఎంత భారీ పారితోషికం నిర్మాతలు ఇచ్చినా తాను సినిమాలలో నటించను అంటూ పవన్ మరొకసారి క్లారిటీ ఇచ్చాడు. తాను నీచ రాజకీయాలు చేయాలి అనుకుంటే తనకు ముఖ్యమంత్రి అవ్వడం పెద్ద కష్టం కాదనీ కేవలం రాజకీయాలలో విలువల కోసం తాను పోరాడుతున్న విషయాన్ని జనసైనికులకు గుర్తు చేసాడు. 

ఈ సందర్భంలో పవన్ నోటివెంట మరణ ప్రస్తావన రావడం జనసైనికులను కలవరపరిచింది. ఒక ఓటమి జనసేనను ఆపలేదు అంటూ తన శవాన్ని నలుగురు జనసైనికులు తీసుకువెళ్ళేవరకు తన తుది శ్వాస ఉన్నంత వరకు తాను ‘జనసేన’ ను అధికారంలోకి తేవడానికి పోరాడుతూనే ఉంటాను అంటూ సంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు ఎక్కడ అవినీతి ఉందో మరెక్కడ ఆకలి ఉందో అక్కడకు వెళ్ళి తాను పోరాటం చేయబోతున్నానని ఆ పోరాటానికి జనసైనికుల సహాయం కావాలి అంటూ పవన్ ఉద్వేగభరితంగా చేసిన ఉపన్యాసం జనసైనికులలో కొత్త ఆలోచనలు కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: