బాలీవుడ్ భామ కియరా అద్వాని తెలుగులో మహేష్, రాం చరణ్ సరసన నటించి క్రేజ్ తెచ్చుకుంది. రెండు సినిమాలకే తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిన కియరా అద్వాని బీ టౌన్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. తెలుగు అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్న అమ్మడు సినిమాలో లిప్ లాక్స్ బాగానే కానిచ్చిందని తెలుస్తుంది.


ముద్దు సీన్లకు కియరా ఫుల్ కోపరేషన్ చేసిందట. అయితే వాటిని మరీ అంత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని.. అన్ని సీన్స్ లానే లిప్ లాక్ సీన్స్ కూడా చాలా నార్మల్ గానే చేశామని చెబుతుంది కియరా. అదరచుంభనం ఎలా నర్మల్ అవుతుంది.. అదే కదా ఆడియెన్స్ కు మంత్రంగా పనిచేస్తుందని అంటున్నారు.


సినిమాలో మిగతా సీన్స్ లానే ముద్దు సీన్స్ కూడా చిత్రీకరించామని.. కథలో.. సీన్స్ లో భాగంగా అవి ఉంటాయని చెప్పుకొచ్చింది. కబీర్ సింగ్ గా వస్తున్న హింది అర్జున్ రెడ్డి సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈమధ్య వచ్చిన ట్రైలర్ లో ఘాటు లిప్ లాక్స్ బాగానే ఉన్నాయి. వాటికి స్పెషల్ గా చేసిందేమి లేదని అంటుంది కియరా.


మొత్తానికి కియరా ఇటు తెలుగుతో పాటుగా అటు బాలీవుడ్ లో కూడా అదరగొడుతుంది. ఈమధ్యనే అమ్మడికి కోలీవుడ్ ఆఫర్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. శివా కార్తికేయన్ హీరోగా విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో సినిమా హీరోయిన్ గా కియరా అద్వాని సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. తెలుగులో సక్సెస్ అయిన ఈ అమ్మడు కోలీవుడ్ లో కూడా అదరగొడుతుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: