గ్రేట్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న 'సాహో' కథ అంటూ తాజాగా ఒక స్టోరీ లైన్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. తన కుటుంబాన్ని అంతం చేసిన ఒక డాన్‌ని చంపడానికి నకిలీ ఇంటర్‌-పోల్‌ ఏజెంట్‌గా చేరి హీరోగా అనుకున్నది సాధిస్తాడనేది ప్రచారం. ఈ కథ తెలిసిన తర్వాత పలువురు ఈఅంశాన్ని ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు.  ప్రభాస్‌ తాజాగా దేశంలోని  అన్నీ చిత్ర రంగాల్లో మిగతా స్టార్‌ హీరోల కంటే తన సినిమాలకు ఎక్కువ బిజినెస్‌ సాధించబోతున్నాడు .
Related image
ఒకటి రెండు టాలీవుడ్ పై ఆధిపత్యం వహిస్తున్న ఆంధ్ర సామాజిక వర్గాల వారు, అలాగే వారి బాలీవుడ్ అనుయాయులు ప్రభాస్ కు దక్కిన బాహుబలి ఇమేజ్‌ తగ్గించివేసి, బాహుబలికి ముందున్న ప్రభాస్ ఇమేజ్ స్థాయికి సాహోతో తీసుకురావాలని కోరుకుంటున్నారు. రెండు వందల కోట్ల రూపాయిల నిర్మాణ వ్యయం తో నిర్మితమైన ఈ సినిమాకి ఇలాంటి కథ తీసుకుంటారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Related image
ఒకవేళ ఈ ట్రోల్స్ నిజమైనా - ఇదే కథ నిజం అనుకున్నా- సాహో సినిమా స్టోరీ లైన్‌ కోసం ఎవరూ థియేటర్లకి రారు. సాహో ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక యాక్షన్‌ సినిమాని ఇండియన్‌ స్క్రీన్‌ పై ప్రత్యేకంగా ఆవిష్కరిస్తూ అందించేందుకు చేస్తోన్న ప్రయత్నం. దీంట్లో యాక్షన్‌ సన్నివేశాలే కళ్లు చెదిరేలా ఒళ్ళు గగుర్పొడిచేలా  వుంటాయి. అద్భుత సాంకేతిక విలువలతో బిగ్-స్క్రీన్ పై చూస్తే తప్ప ప్రేక్షకులు కోరుకున్నంత లేదా వారి ఊహాలకు అతీతంగా థ్రిల్‌ రానంత గా వీటిని తెరకెక్కించినట్టు సమాచారం. 
Image result for saaho action scene
వందల కోట్ల రూపాయిలు వసూలు చేసిన 'ధూమ్‌' సిరీస్‌ లో ఏమి కథ వుందని జనాలు విరగబడి చూశారు? ఈ తరహా యాక్షన్‌ చిత్రాలకి విజువల్స్, స్చ్రీన్ ప్రెజంటేషన్, థ్రిల్స్‌, బాక్-గ్రౌండ్  స్కొర్ చాలా కీలకం. సాహో నిర్మాతలు పెట్టిన ఖర్చులో ఎక్కువశాతం యాక్షణ్ సన్నివేశాల చిత్రీకరణ మీదే పెట్టింది. కనుక ఇలాంటి స్టోరీ లైన్స్‌ వినేసి దీనిని తీసి పారేయాలని జనం అనుకుంటారనే ఆలోచన ఆ ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా వుంది. అంతే కాదు అది వారి మతిమాలిన తనం ఋజువు చేస్తుంది తప్ప ఈ సినిమీఅకు గాని ప్రభాస్ కు గాని ఏ హానీ జరగక పోగా, ఇంకా ఈ నెగేటివ్ ప్రచారం ప్రభాస్ కు మేలే చేస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

Image result for saaho action scene

మరింత సమాచారం తెలుసుకోండి: