టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో పై కేవలం టాలీవుడ్ లోనే కాక దేశవ్యాప్తంగా కూడా ఎంతో క్రేజ్ ఏర్పడింది. అయితే గతంలో అయన నటించిన బాహుబలి సిరీస్ అద్భుత విజయాలు అందుకోవడం అందుకు కారణం. ఇకపోతే ఎంతో భారీ ఖర్చుతో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ కొన్ని కారణాల వలన మధ్యలో ఎంతో జాప్యం జరిగింది. 

ఇక ఇటీవల సినిమాని రాబోయే ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం రెండు మేకింగ్ వీడియోస్ మాత్రమే విడుదల చేసిన చిత్ర బృందం, మరికొద్దిరోజుల్లో సినిమా అధికారిక టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. నిజానికి నిర్మాతలు మొన్న రంజాన్ సందర్భంగా టీజర్ ని విడుదల చేద్దామని భావించినప్పటికీ అది కుదర లేదు. అయితే నేడు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, సాహో టీజర్ ని వచ్చేవారం విడుదల చేయనున్నట్లు సమాచారం. 

ఈమేరకు నేడు లేదా రేపు ఆ చిత్ర  యూనిట్ నుండి ఒక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. అలానే ఇటీవల చిత్రం నుండి అర్ధంతరంగా తప్పుకున్న సంగీత దర్శకుల స్థానంలో కొత్త సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకున్నారో కూడా ఈ సందర్భంగా ప్రకటించనున్నారట. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం, ఎప్పటినుండో టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: