అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున విడుదల కాబోతున్న ‘సైరా’ మూవీ మార్కెట్ కు రామ్ చరణ్ అనుసరిస్తున్న వ్యూహాలు సమస్యగా మారుతున్నాయా అన్న సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనికి కారణం ఈమూవీ బయ్యర్లకు చరణ్ చెపుతున్న చుక్కలు తాకుతున్న రేట్లు అని అంటున్నారు.

వాస్తవానికి ఈమూవీకి ఏర్పడ్డ క్రేజ్ రీత్యా బయ్యర్ల దగ్గర నుండి ఈమూవీకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైట్స్ కోసం 90 కోట్ల వరకు ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. అయితే చరణ్ కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ నుండి తనకు 120 కోట్లు కావాలి అని డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో బయ్యర్లు చరణ్ డిమాండ్స్ విని భయపడుతున్నట్లు టాక్. 

చరణ్ కోరిన విధంగా కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం 120 కోట్లు పెడితే ఈమూవీకి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి 175 కోట్ల పైన కలక్షన్స్ రావాలని అలాంటి రేంజ్ ‘సైరా’ కు ఎక్కడ ఉంది అని తెలుగు రాష్ట్రాల బయ్యర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు చారిత్రాత్మక సినిమాలను ప్రేక్షకులు ఒకసారి చూస్తారు కానీ మళ్ళీమళ్ళీ రిపీటెడ్ గా చూడరు అన్న ప్రాధమీక విషయం చరణ్ కు ఎందుకు అర్ధం కావడం లేదో తమకు తెలియడం లేదు అంటూ చాలామంది బయ్యర్లు అంతర్మధనంలో ఉన్నట్లు తెలుస్తోంది.  

వాస్తవానికి ఈసినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు అయిన విషయం వాస్తవమే అయినా ఈమూవీకి పెట్టిన ఖర్చులో సుమారు రెండు వంతులు తెలుగు రాష్ట్రాల మార్కెట్ నుండి రప్పించుకుని శాటిలైట్ డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే భారీమొత్తాలను లాభంగా మార్చుకోవాలని చరణ్ అనుసరిస్తున్న వ్యూహాలు వినడానికి బాగున్నా వాస్తవ దృష్టిలో అవి ఆచరణ సాధ్యం కాదు అని అంటున్నారు. దీనికితోడు విడుదలైన ఏ భారీ సినిమాకు లాభాలు చెప్పుకోతగ్గ స్థాయిలో రాని నేపధ్యంలో చరణ్ మొండిపట్టు ఎంతవరకు లాభాన్ని తెచ్చి పెడతాయి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: